Jubille Hills By Election Result: కౌంటింగ్‌కు ముందు విషాదం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి చెందారు. మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో చనిపోయారు. NCP నుంచి బరిలోకి దిగిన మహమ్మద్ అన్వర్ .. ఓట్ల లెక్కింపు ముందే చనిపోయారు.. దీంతో అన్వర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో భాగంగా ముందుగా బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫోర్స్‌తో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు.. మొత్తం 700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ స్టేడియం దగ్గర లోపల, బయట మూడంచెల సెక్యూరిటీతో పటిష్ట బందో బస్తు నిర్వహిస్తున్నారు.
కోట్ల విజయభాస్కర్ స్టేడియం దగ్గర ఉన్న పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 100 మీటర్ల వరకు పోలీసు ఆంక్షలు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఫలితాల తర్వాత స్టేడియం దగ్గర ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..