Jubilee Hills By Poll Result: జూబ్లీహిల్స్ తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం.. ఇదిగో లేటెస్ట్ ట్రెండ్స్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ముందు పోస్టల్ ఓట్లు లెక్కింపు చేసిన అనంతరం.. వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం వెలువడనుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ముందు పోస్టల్ ఓట్లు లెక్కింపు చేసిన అనంతరం.. వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం వెలువడనుంది. భారీ భద్రత.. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ పకడ్బందీగా జరుగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. షేక్ పేట డివిజన్‌లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది.
షేక్‌పేట్ డివిజన్‌లో హోరాహోరీ..
తొలిరౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు
బీఆర్ఎస్‌కు పోలైన 8,864 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్‌లో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్-39, బీఆర్ఎస్-36, బీజేపీ-10 ఓట్లు వచ్చాయి..
