Jubilee Hills ByPoll Result 2025 Highlights: జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్‌దే.. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు..
Jubilee Hills By-Election Result 2025 Counting highlights: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. విజేతను తేల్చేందుకు 42 టేబుల్స్‌పై మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. డివిజన్ల వారీగా చూస్తే, షేక్‌పేట డివిజన్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమై, చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 186 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 250 మందికి పైగా పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్దకు ప్రజలు గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదు.
LIVE NEWS & UPDATES
-
జూబ్లీహిల్స్ ప్రజల తీర్పును శిరసావహిస్తాం -కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ప్రజల తీర్పును శిరసావహిస్తాం -కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్లు లేరు
జూబ్లీహిల్స్‌లో మాకు పెద్దగా బలం లేకపోయినా.. మా శక్తినంతా కూడగట్టి ప్రచారం చేశాం
ఎంఐఎం సపోర్ట్‌తో కాంగ్రెస్ గెలిచింది
జూబ్లీహిల్స్ తీర్పుపై పునః సమీక్ష జరుపుతాం -కిషన్ రెడ్డి.
-
మాగంటి సునీత చాలా కష్టపడ్డారు – కేటీఆర్
- ఉప ఎన్నికలో మాగంటి సునీత చాలా కష్టపడ్డారు – కేటీఆర్
- బీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు – కేటీఆర్
-
-
నైతికంగా నేనే గెలిచా – సునీత
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు – మాగంటి సునీత
- రౌడీయిజంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు
- ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్
- కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచింది – మాగంటి సునీత
- ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు
- కాంగ్రెస్‌ది గెలుపు కాదు..నైతికంగా నేనే గెలిచా – సునీత
-
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
- భారీ మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్
- అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం సాధించిన కాంగ్రెస్
-
సీఎం రేవంత్ ప్రెస్ మీట్
- సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం
- మంత్రులతో భేటీ తర్వాత సీఎం రేవంత్ ప్రెస్‌మీట్
-
-
9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తున్న కాంగ్రెస్
- 9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం
- 9వ రౌండ్ తర్వాత కాంగ్రెస్‌కు 23,612 ఓట్ల ఆధిక్యం
-
8వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
- 8వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
- 8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 1876 ఓట్ల ఆధిక్యం
- 8 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం – 21,495 ఓట్లు
-
తెలంగాణలో పనిచేయని సెంటిమెంట్
- తెలంగాణ ఉప ఎన్నికల్లో పనిచేయని సెంటిమెంట్
- అభ్యర్థుల మరణాలతో ఇప్పటివరకు ఆరు ఉప ఎన్నికలు
- నాగార్జునసాగర్‌లో మాత్రమే ఫలించిన సానుభూతి
- మిగతాచోట్ల పనిచేయని సెంటిమెంట్
- నారాయణఖేడ్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ సీటు బీఆర్ఎస్ కైవసం
- పాలేరు సిట్టింగ్ కాంగ్రెస్ సీటులో బీఆర్ఎస్ గెలుపు
- దుబ్బాకలో సిట్టింగ్ సీటు కోల్పోయిన బీఆర్ఎస్
- కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ కైవసం
- జూబ్లీహిల్స్‌లోనూ పనిచేయని సెంటిమెంట్
-
అప్పుడే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది
- ఎన్నికల ప్రచారంలోనే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది – మంత్రి సురేఖ
- రెండు సార్లు ఓడినా, ప్రజల్లో ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు – సురేఖ
- గెలుపు తర్వాత నవీన్ ప్రజల మనిషి లాగే ఉండాలి – సురేఖ
- జూబ్లీహిల్స్ ప్రజలకు.. ఎంఐఎం శ్రేణులకు కృతజ్ఞతలు – మంత్రి
-
Jubilee Hills Election Result: అభివృద్ధికే ప్రజలు ఓటేశారు – మంత్రి వాకిటి
- అభివృద్ధికే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేశారు – మంత్రి వాకిటి శ్రీహరి
- జూబ్లీహిల్స్ అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటాం
- ఈ ఎన్నికలను కేటీఆర్ రెఫరెండంగా భావిస్తారా
- ప్రజల నమ్మకాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది – మంత్రి వాకిటి
-
Jubilee Hills ByPoll Result: 7వ రౌండ్‌లోను కాంగ్రెస్ హవా
- 7వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ హవా
- ఈ రౌండ్‌లో 4030 ఓట్ల మెజారిటీ
- ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం 19,619 వేలు దాటిన కాంగ్రెస్ మెజారిటీ
-
Jubilee Hills ByPoll Counting: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్‌రెడ్డి
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ
- పెద్దగా ప్రభావం చూపని కమలం పార్టీ
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్‌రెడ్డి
- ఎన్నికల్లో డబ్బు ప్రభావం పని చేసింది – దీపక్‌రెడ్డి
- బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు – దీపక్‌రెడ్డి
-
Jubilee Hills By-Election Result 2025: 6వ రౌండ్‌లో కాంగ్రెస్ 2938 ఓట్ల లీడ్
- 6వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- 6వ రౌండ్‌లో కాంగ్రెస్ 2938 ఓట్ల లీడ్
- మొత్తం 6 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ లీడ్ -15589 ఓట్లు
-
కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ – పొన్నం
- అభివృద్ధికే ప్రజలు ఓటేశారు – మంత్రి పొన్నం
- ఓటమి భయంతో బీఆర్‌ఎస్ ఎన్నో ఆరోపణలు చేసింది
- కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వస్తుంది – పొన్నం
-
Jubilee Hills By-Poll Result 2025: కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
- గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
- కాసేపట్లో గాంధీభవన్‌కు మంత్రులు
- నవీన్ యాదవ్ ఆఫీస్‌లోనూ మొదలైన వేడుకలు
- బాణసంచా కాల్చి కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
-
ఈ డివిజన్లలో ఓట్ల లెక్కింపు పూర్తి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ మూడు డివిజన్లలోనూ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యత వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 12,651 ఓట్ల లీడ్‌లో కొనసాగుతుంది.
-
అధికారికంగా మూడు రౌండ్ల ఫలితాలు
- ఇప్పటి వరకు అధికారికంగా మూడు రౌండ్ల ఫలితాలు
- తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 47 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,995 ఓట్ల ఆధిక్యం
- మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,948 ఓట్ల ఆధిక్యం
-
గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
- భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్
- రౌండ్ రౌండ్‌కు పెరుగుతున్న మెజార్టీ
- గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
-
సీఎం రేవంత్ ఇంట్లో లక్ష్మీదేవి పూజ
- సీఎం రేవంత్ ఇంట్లో లక్ష్మీదేవి పూజ
- పూజలో పాల్గొన్న రేవంత్
-
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 ఓట్ల లీడ్
- ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 లీడ్
- ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం – 12,651
-
మొదటి రౌండ్‌లో నాలుగో స్థానం ఎవరిదంటే..?
మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో బీజేపీ నిలవగా.. నాలుగో స్థానంలో నోటా నిలిచింది. నోటాకు 99 ఓట్లు వచ్చాయి.
-
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు భారీ లీడ్
- నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 9567 ఓట్లు
- బీఆర్ఎస్ పార్టీకి – 6020 ఓట్లు
- నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ – 9435 ఓట్లు
-
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- కొనసాగుతున్న ఉపఎన్నిక కౌంటింగ్
- నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
-
మూడు రౌండ్లలో కలిపి 6047 ఓట్లతో కాంగ్రెస్ లీడ్
- కొనసాగుతున్న నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
- మూడు రౌండ్లలో కలిపి 6047 ఓట్లతో కాంగ్రెస్ లీడ్
-
మూడో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్
- మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం
-
గెలుపు కాంగ్రెస్‌దే
- జూబ్లీహిల్స్‌లో గెలుపు కాంగ్రెస్‌దే – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
- ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టబోతున్నారు
- మంచి మెజార్టీ రావాల్సి ఉండేది
- ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది
-
మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్‌కు 3400 ఓట్లకు పైగా ఆధిక్యం
-
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు
మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ డివిజన్ 6 బూత్స్,
రహ్మత్ నగర్ డివిజన్ 28 బూత్స్
వెంగళరావు నగర్ 8 బూత్స్‌లో కొనసాగుతున్న లెక్కింపు
-
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్
ఒక్కో రౌండ్‌లో 42 బూత్‌ల ఓట్ల లెక్కింపు
మొదటి రౌండ్ లో.. షేక్‌పేట్ -28 బూత్‌లు
ఎర్రగడ్డ -10 బూత్‌లు, వెంగళరావు నగర్ -4 బూత్‌లు
మొదటి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు -8,926 ఓట్లు
మొదటి రౌండ్‌లో మాగంటి సునీతకు -8,864 ఓట్లు
మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ 62 ఓట్ల లీడ్ వచ్చింది.
రెండో రౌండ్‌లోనూ షేక్‌పేట్ -28 బూత్‌ల లెక్కింపు
రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 9,691 ఓట్లు
రెండో రౌండ్‌లో BRSకు 8,609 ఓట్లు
రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 1,082 ఓట్ల ఆధిక్యం
రెండురౌండ్లు కలిపి కాంగ్రెస్‌కు 1,144 ఓట్ల ఆధిక్యం
-
మూడో స్థానంలో బీజేపీ..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. రెండు రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా.. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది. అయితే బీజేపీ మాత్రం మూడో స్థానానికే పరిమితమైంది. తొలి రౌండ్‌లో కమలం పార్టీకి 2167 ఓట్లు మాత్రమే వచ్చాయి.
-
రెండో రౌండ్‌లో 2995 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్
- రెండో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- కాంగ్రెస్‌కు 2995 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్లలో కాంగ్రెస్‌కు 17,874 ఓట్లు
- బీఆర్ఎస్ పార్టీకి 1,4879 ఓట్లు
- బీజేపీకి 3475 ఓట్లు
-
తొలిరౌండ్‌లో హోరాహోరీ
- తొలిరౌండ్‌లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ హోరాహోరీ
- తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ – 8,926 ఓట్లు
- బీఆర్ఎస్ పార్టీకి – 8,864 ఓట్లు
- తొలిరౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
-
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్
- తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- షేక్‌పేట డివిజన్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం
-
Jubilee Hills By Election Result: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివరాలు
- కాంగ్రెస్ – 47 ఓట్లు
- బీఆర్ఎస్ – 43 ఓట్లు
- బీజేపీ – 11ఓట్లు
-
Jubilee Hills ByPoll Result: ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం..
- ప్రారంభమైన ఈవీఎం ఓట్ల లెక్కింపు
- కొనసాగుతున్న షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
- ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాలు పట్టే ఛాన్స్
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్
ముగిసిప పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి
పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
-
Jubilee Hills By Election Result: రౌండ్ 1లో షేక్‌పేట్ డివిజన్‌తో
- రౌండ్ – 1 ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. షేక్‌పేట్ డివిజన్‌లో మొత్తం 42 బూత్స్ ఉన్నాయి.
- రౌండ్ – 2 రెండో రౌండ్‌లోనూ షేక్‌పేట్ డివిజన్‌లో ఉన్న మరో 28 బూత్స్ లెక్కిస్తారు. అంతేకాకుండా ఎర్రగడ్డ డివిజన్‌లో 10 బూత్స్, వెంగళరావు డివిజన్‌లో 4 బూత్స్ లెక్కిస్తారు.
-
Jubilee Hills ByPoll Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం
- జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ముందు పోస్టల్ ఓట్లు లెక్కింపు మొదలు
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 101 పోస్టల్ ఓట్లు
- ఆ తర్వాత తెరుచుకోనున్న ఈవీఎంలు
- మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు
-
Jubilee Hills By Election Result: పోటీ చేసిన అభ్యర్థి మృతి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి
- గుండెపోటుతో చనిపోయిన మహమ్మద్ అన్వర్
- NCP నుంచి బరిలోకి దిగిన మహమ్మద్ అన్వర్
- ఓట్ల లెక్కింపు ముందే చనిపోయిన అభ్యర్థి
-
Jubilee Hills Election Result: 3 గంటల్లో తేలనున్న ఫలితం
- మూడు గంటల్లోనే తెలనున్న జూబ్లీహిల్స్ ఫలితం
- మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- 10 రౌండ్స్ లో కౌంటింగ్.. 42 టేబుల్స్ ఏర్పాటు
- ఒక్కో టేబుల్‌కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు
- ఫస్ట్ షేక్‌పేట.. లాస్ట్ ఎర్రగడ్డ ఓట్ల లెక్కింపు
-
45 వేల మెజారిటీతో గెలుస్తా
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూజలు
- 45 వేల పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నా – నవీన్ యాదవ్
- నాపై జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి – నవీన్ యాదవ్
- ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య మద్దతు లభించింది – నవీన్
- ఓడిపోయే వ్యక్తులు చేసే ఆరోపణలను పట్టించుకోను – నవీన్
-
బీఆర్ఎస్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు
ఇప్పటికే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పల్లె రవి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.
Published On - Nov 14,2025 7:00 AM
