Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? మాటలు రావు.. వినిపించదు.. అభినయంలో మాత్రం అదరగొడుతోన్న హీరోయిన్
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంటోంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయమేంటో తెలుసా? ఆమెకు మాటలు రావు. కనీసం వినపడదు కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంటోంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయమేంటో తెలుసా? ఆమెకు మాటలు రావు. కనీసం వినపడదు కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం సైన్ లాంగ్వేజ్ తోనే ఆమె తన భావాలను వ్యక్తపర్చగలదు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ క్యూటీ మరెవరో కాదు అభినయ. అదేనండి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో.. వెంకటేష్, మహేశ్ బాబు సోదరిగా అద్భుతంగా నటించి మెప్పించిన నటి. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ఇటీవలే అభినయ తల్లి హఠాత్తుగా కన్నుమూసింది. ఆటోలో వెళుతుండగా ఊహించని విధంగా ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా నటి అభినయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా తన తల్లితో తనకున్న మధుర జ్ఞాపకాలను తల్చుకుని ఎమోషనలైందీ అందాల తార.
తమిళనాడుకు చెందిన అభినయ పుట్టుకతోనే బధిర. అంటే ఆమె మాట్లాడలేదు. వినపడదు కూడా. అయినా కూడా తన అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన “నేనింతే” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అభినయ. ఆ తర్వాత నాగార్జున కింగ్, తమిళంలో నాడోడిగల్ సినిమాల్లో నటించింది.
అభినయ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
అయితే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యిందీ అందాల తార. ఆ తర్వాత దమ్ము, ఢమరుకం, జీనియస్, రాజుగారి గది 2, ధ్రువ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తెలుగులో అభినయ నటించిన సీతారామం, గామి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే కోలీవుడ్ లో మార్క్ ఆంటోని సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
చీర కట్టులో సంప్రదయ బద్ధంగా నటి అభినయ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.