మోసం చేస్తే వదిలేస్తా.. కానీ మనుషులు అన్నప్పుడు తప్పులు చేస్తారు..
Rajitha Chanti
Pic credit - Instagram
25 May 2026
ప్రేమ, పెళ్లి బంధాలలో నమ్మకం, మోసం, క్షమాగుణం అనేవి ఎప్పుడూ చర్చనీయాంశాలుగానే ఉంటాయి. ముఖ్యంగా సినీతారల వ్యక్తిగత విషయాలు నెట్టింట చర్చకు వస్తూనే ఉంటాయి.
భాగస్వామి చేసిన తప్పును క్షమించి, బంధాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చా లేదా అనే విషయంపై తాజాగా బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన తాజా చిత్రం 'పతి పత్ని ఔర్ వో దో' ప్రమోషన్స్‌లో భాగంగా, సహనటులు ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్‌లతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ చర్చ జరిగింది.
రిలేషన్‌షిప్‌లో మోసం చేయడం ఎప్పటికైనా అంగీకారయోగ్యమేనా అని ప్రశ్నించినప్పుడు, రకుల్ ఏమాత్రం ఆలోచించకుండా "అస్సలు కాదు!" అని అన్నారు.
మోసం అనేది ఒక అలవాటుగా మారితే అస్సలు క్షమించకూడదని స్పష్టం చేశారు. కానీ ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు లేదా తప్పు అనాలోచితంగా జరిగితే ఒప్పుకోవచ్చు.
ఆ ఒక్క తప్పు కోసమే జీవితాంతం క్షమించకుండా ఉండటానికి జీవితం చాలా చిన్నదని, అలాంటి సందర్భాలలో రెండో అవకాశం ఇవ్వవచ్చని రకుల్ చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు కేవలం సాధారణ రిలేషన్‌షిప్స్ గురించి మాత్రమేనని, తన వ్యక్తిగత వైవాహిక జీవితానికి వీటికి ఎలాంటి సంబంధం లేదని రకుల్ అన్నారు.
ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రకుల్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది.