- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna trying new genre movies after her pushpa movie success Telugu Actress Photos
Rashmika Mandanna: పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక కొత్త ప్రయోగం.! కామెడీ , హారర్..
ఒక్కసారి ఫేమ్ వచ్చాక, అటూ ఇటూ చూడాల్సిన అవసరం ఏముంటుంది.? వచ్చిన ఫేమ్‌ని చక్కగా కాపాడుకుంటే సరిపోతుంది. అదే ఇంకో పది మెట్లు ఎక్కించేస్తుంది. అంతే కదా అని అంటున్నారు రష్మిక మందన్న. అలాగని అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు ఈ బ్యూటీ.. తనలో ఉన్న పొటెన్షియల్‌ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో చూపించాలనుకుంటున్నారు. విషయం ఏదైనా సరే, కూర్చుని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న.
Updated on: Sep 01, 2024 | 3:56 PM

ఒక్కసారి ఫేమ్ వచ్చాక, అటూ ఇటూ చూడాల్సిన అవసరం ఏముంటుంది.? వచ్చిన ఫేమ్‌ని చక్కగా కాపాడుకుంటే సరిపోతుంది. అదే ఇంకో పది మెట్లు ఎక్కించేస్తుంది. అంతే కదా అని అంటున్నారు రష్మిక మందన్న.

అలాగని అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు ఈ బ్యూటీ.. తనలో ఉన్న పొటెన్షియల్‌ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో చూపించాలనుకుంటున్నారు.

విషయం ఏదైనా సరే, కూర్చుని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ.

పుష్ప2 షూటింగులో తన పార్టును వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప2 తో పాటు సైమల్‌టైనియస్‌గా కుబేర షూట్‌ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ.

అలా చేస్తేనే.. ఆమె వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ షెడ్యూల్‌ని క్యాచ్ చేయగలుగుతారు. అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ మొదలవుతుంది. అక్టోబర్ థర్డ్ వీక్‌లో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా షూట్‌లో జాయిన్ అవుతారు.

హంపీ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీగా తెరకెక్కనుంది వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్. స్త్రీ2, బేడియా, ముంజ్య సినిమాల కోవలో ఈ మూవీ కూడా మెప్పిస్తుందనే టాక్ ఆల్రెడీ మొదలైంది. తాజా సినిమాలో రష్మిక కేరక్టర్‌కి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయట.

నార్త్ లో యానిమల్‌తో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. డిసెంబర్‌లో చావా ఎలాగూ రిలీజ్‌కి రెడీ అవుతోంది. సౌత్, నార్త్ ని నాజూగ్గా బ్యాలన్స్ చేస్తున్నారు మన నేషనల్ క్రష్ అని అభిమానంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.




