అందం అదిరిందబ్బా.. చిట్టిగౌనులో పెద్ద పాప.. నజ్రియా క్యూట్ లుక్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
25 May 2026
మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లోనూ అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నజ్రియా నజీమ్
తనదైన సహజసిద్ధమైన నటన, ముగ్ధమనోహరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ క్యూట్ బ్యూటీ, తాజాగా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు వైరలవుతున్నాయి.
విభిన్నమైన స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో ఆమె ఇచ్చిన ఫోజులు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడు తన క్యూట్ అండ్ బబ్లీ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది
తాజాగా నజ్రియా క్లాసీ అండ్ స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోయింది. మినిమల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఆమె పండించిన క్యూట్‌నెస్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
"ఎప్పటికీ తరగని అందం", "క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్" అంటూ ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లైకులు, షేర్లతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
తెలుగులో నాని సరసన 'అంటే సుందరానికీ!' సినిమాతో నేరుగా ఎంట్రీ ఇచ్చిన నజ్రియా, హోమ్లీ క్యారెక్టర్‌తో ఇక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.
ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ భార్య అయినప్పటికీ, తనకంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని.. కథానాయికగా రాణిస్తుంది.
కెరీర్ పరంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే, ఇలాంటి క్యూట్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్‌తో నిరంతరం అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ అమ్మడు.