TNR Last Words: కరోనా గురించి ఇంత తెలిసిన వ్యక్తి ఎలా మరణించాడు.. కన్నీరు పెట్టిస్తోన్న టీఎన్ఆర్ చివరి మాటలు..
TNR Last Words: కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు బాగానే కనిపిస్తోన్న మనిషి ఒక్కసారిగా శ్వాస అందక కుప్పకూలిపోతున్నాడు. శ్వాస వ్యవస్థపై..
TNR Last Words: కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు బాగానే కనిపిస్తోన్న మనిషి ఒక్కసారిగా శ్వాస అందక కుప్పకూలిపోతున్నాడు. శ్వాస వ్యవస్థపై దాడి చేస్తోన్న ఈ మయదారి రోగం క్షణాల్లో ప్రాణాలను బలి తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా కరోనా వ్యాధిపై ఎంతో అవగాహన ఉండి, ఇతరులకు విజ్ఞాన్ని పంచే వ్యక్తులు సైతం కరోనాతో మృతి చెందుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ సోమవారం ఉదయం కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇండస్ట్రీలో ఎంతో మందితో ఫ్రాంక్లీ విత్ టీఎన్ ఆర్ పేరుతో ఇంటర్వ్యూలు చేసిన ఆయన ఒక్కసారిగా లోకాన్ని వదిలి వెళ్లడాన్ని ఆయనతో పరిచయం ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక టీఎన్ఆర్ చివరిసారిగా మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. కరోనా మహమ్మారిని ఎలా జయించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతూ టీఎన్ఆర్ గతంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఆయన అభిమానులను కలిచి వేస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన టీఎన్ఆర్ తాను ఖాళీ సమయంలో ఏం చేస్తున్నాననో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో టీఎన్ఆర్ కరోనాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. కరోనాకు ఎవరూ భయపడొద్దని చెబుతూ.. ఖాళీ సమయంలో ప్రాణామాయం నేర్చుకున్నానని, పుస్తకాలు చదువుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక కుటుంబంలో పెద్దలు కరోనా కారణంగా భయాందోళనకు గురవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండని చెప్పుకొచ్చారు. టీఎన్ చివరి మాటలను మీరూ ఓ సారి వినండి..
టీఎన్ఆర్ చివరి మాటలకు సంబంధించిన వీడియో..
Also Read: JR NTR Corona: కరోనా బారినపడ్డ జూనియర్ ఎన్టీఆర్.. స్వయంగా ట్వీట్.. ప్రస్తుతం ఎలా ఉందంటే