కంగనాకు మరోసారి దెబ్బ.. ఆమె పెట్టిన పోస్ట్‏ను డెలీట్ చేసిన ఇన్‏స్టాగ్రామ్.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏం రాసిందంటే..

Kangana Ranaut: కంగనా రనౌత్.. బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్.. కానీ ఎక్కువగా ప్రతి విషయంపై వివాద్పత వ్యాఖ్యలు చేస్తూ జనాల్లో గుర్తింపు పొందింది.

కంగనాకు మరోసారి దెబ్బ.. ఆమె పెట్టిన పోస్ట్‏ను డెలీట్ చేసిన ఇన్‏స్టాగ్రామ్.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏం రాసిందంటే..
Kangana Ranut
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2021 | 11:43 AM

Kangana Ranaut: కంగనా రనౌత్.. బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్.. కానీ ఎక్కువగా ప్రతి విషయంపై వివాద్పత వ్యాఖ్యలు చేస్తూ జనాల్లో గుర్తింపు పొందింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ప్రతి విషయంపై తన స్టైల్లో కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఎన్నో సార్లు కంగానా నెటిజన్స్ ఆగ్రహనికి గురికావడమే కాకుండా.. పలువురు రాజకీయ నేతలకు కూడా కోపం తెప్పించింది. ఇటీవలే ఈ బాలీవుడ్ బ్యూటీకి ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మత సామరస్యం దెబ్బతినేలా పోస్టులు పెడుతుందనే కారణంతో ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేసింది. ఇక కంగనా ఊరికే ఉంటుందా.. మరో సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించి.. మళ్లీ తన శైలీలో పోస్టులు పెట్టడం ప్రారంభించింది. ఇంకేముంది అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది.

ఇటీవల కంగనాకు కరోనా సోకింది. దీంతో ఆ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఐతే ఆందులో ఆమె రాసిన కంటెంట్ పై చాలామంది అభ్యంతరం ప్రకటించారు. దాంతో ఇన్ స్టాగ్రామ్ ఆమె పెట్టిన పోస్ట్ ని డిలిట్ చేసింది. అయితే ట్విట్టర్ లా ఇన్ స్టాగ్రామ్ ఆమెని బహిష్కరించినిషేధం పెట్టలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ ని తొలగించింది. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే.. “కొన్ని రోజులుగా కొంచెం నీరసంగా కళ్ళలో మంటగా ఉంటుంది. నేను హిమాచల్ వెళ్దామని అనుకున్నాను. దీంతో వెంటనే టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. నా శరీరంలో వైరస్ పార్టీ చేసుకుంటుందనే విషయం నాకు తెలియదు. కానీ నేను దాన్ని నాశనం చేస్తాను. మీరు ఎంత భయపడితే.. అది మిమ్మల్ని మరింతగా భయపెడుతుంది. దానిపై మనం కలిసి పోరాటం చేయాలి. కోవిడ్-19 అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే.. అందరి మనస్తత్వంతో ఆడుకుంటుంది.. దాన్ని అణిచేయాలి’’ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అయితే అందులో పోస్ట్ డెలీట్ చేసేంతగా కఠిన పదాలు ఏమున్నాయి అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందాం.

Kangana

Kangana

“కరోనా ఫ్లూ లాంటి చిన్న రోగం. మీడియా ఎక్కువ ప్రచారం చేసి భయపెడుతోంది.”. ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందిపడుతూ మరణిస్తూంటే…చిన్న రోగం అనటం అభ్యంతరకమైన విషయం. దీంతో ఇన్ స్టా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం కంగనా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. 7 రోజులు బంద్ కానున్న బ్యాంకులు… ఎప్పుడెప్పుడంటే..