Covid Vaccine: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కరోనా వైరస్.. కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న స్టార్ కపుల్..
Covid Vaccine: బాలీవుడ్ స్టార్ కపుల్ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ సోమవారం నాడు కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారు.
Covid Vaccine: బాలీవుడ్ స్టార్ కపుల్ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ సోమవారం నాడు కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వారే ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వ్యాక్సి్న్ వేయించుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రితీష్, జెనీలియా కూడా ఇవాళ వ్యాక్సీన్ వేసుకున్నారు. అందరూ వ్యాక్సీన్ వేసుకోవాలని, సురక్షితంగా ఉండాలని ఈ స్టార్ కపుల్ పిలుపునిచ్చింది.
రితీష్ దేశ్‌ముఖ్ తాము టీకా తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించాడాడు. ‘‘టీకాలు వేయించుకుందాం.. కరోనా మహమ్మారిపై కలిసి పోరాడుదాం..’’ క్యాప్షన్ పెట్టాడు. దాంతోపాటు.. తాను వ్యాక్సీన్ తీసుకుంటున్న ఫోటోను కూడా రితీష్ దేశ్‌ముఖ్ పోస్ట్ చేశాడు. అలాగే జెనీలియా కూడా తాను వ్యాక్సీన్ తీసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్ ద్వారా షేర్ చేసింది. అందరూ వ్యాక్సీన్ తీసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. ‘వ్యాక్సీన్ తీసుకుందాం.. కరోనా మహమ్మారిపై కలిసి పోరాడుదాం..’ అని ఇన్‌స్టాగ్రమ్‌లో క్యాప్షన్ పెట్టింది జెనీలియా.
ఇదిలాఉంటే.. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు కోవిడ్ వ్యాక్సీన్‌ను వేయించుకున్న విషక్ష్ం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, హేమా మాలిని, మోహన్ లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున తదితర ప్రముఖులు ఇప్పటికే టీకా వేయించుకున్నారు. మరికొందరు ప్రముఖులు సైతం వ్యాక్సీన్ వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్, మనీష్ మల్హోత్రా వంటి స్టార్స్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన బాలీవుడ్ స్టార్.. వ్యాక్సీన్ తీసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3,66,161 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,26,62,575 లకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 24 గంటల్లో 3,754 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కరోనా మృతుల సంఖ్య 2,46,116 లకు చేరింది. ప్రస్తుతం, భారతదేశంలో 37,45,237 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Genelia Instagram:
View this post on Instagram
View this post on Instagram
Also read:
JR NTR Corona: కరోనా బారినపడ్డ జూనియర్ ఎన్టీఆర్.. స్వయంగా ట్వీట్.. ప్రస్తుతం ఎలా ఉందంటే
Aadhaar: ఆధార్‌లోని అడ్రస్‌ను మార్చడం అద్దెదారులకు ఇక చాలా ఈజీ..! అయితే ఇలా చేయండి..!