Jr. NTR Covid-19 positive: క‌రోనా బారిన‌ప‌డ్డ జూనియ‌ర్ ఎన్టీఆర్.. స్వ‌యంగా ట్వీట్.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే

Jr. NTR Corona positive టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు.

Jr. NTR Covid-19 positive:  క‌రోనా బారిన‌ప‌డ్డ జూనియ‌ర్ ఎన్టీఆర్.. స్వ‌యంగా ట్వీట్.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే
JR NTR
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2021 | 3:48 PM

టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తార‌క్ తెలిపారు. త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా త‌నను కాంటాక్ట్ అయిన‌వాళ్లు వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌ని ఎన్టీఆర్ సూచించారు.

కాగా ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. కాగా ఈ చిత్రంలో న‌టిస్తున్న మ‌రో స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ స‌హా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కుటుంబం గ‌తంలో క‌రోనా బారిన‌ప‌డి కోలుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత దారుణంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజూ భారీగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీస‌కుంటున్న‌ప్ప‌టికీ వైర‌స్ వ్యాప్తి మాత్రం ఆగ‌డం లేదు.

Also Read: తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

ఆధార్‌లోని అడ్రస్‌ను మార్చడం అద్దెదారులకు ఇక చాలా ఈజీ..! అయితే ఇలా చేయండి..!