Telangana police: తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

Blocking Covid-19 Ambulances: సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. క‌రోనాకు చికిత్స కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణలోకి వ‌చ్చే క‌రోనా రోగుల‌ వాహనాలను పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. తెలంగాణలో ఉన్న

Telangana police: తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..
ambulance
Follow us

|

Updated on: May 10, 2021 | 12:12 PM

Blocking Covid-19 Ambulances: సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. క‌రోనాకు చికిత్స కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణలోకి వ‌చ్చే క‌రోనా రోగుల‌ వాహనాలను పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. తెలంగాణలో ఉన్న ఆసుపత్రిల్లో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్లతో వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉద‌యం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ సరిహద్దుల ప్రాంతాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి క‌రోనా రోగుల‌తో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా రోగులను తెలంగాణ‌లోకి అనుమతించ‌ట్లేద‌ని పోలీసులు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చే ఇత‌ర‌ వాహనాలను మాత్రం అనుమ‌తిస్తున్నామని వెల్లడించారు.

కాగా తెలంగాణలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే.. హైదరాబాద్‌లో క‌రోనా చికిత్స‌ల కోసం ఆసుప‌త్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌక‌ర్యాలు లేవ‌ని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న కర్నూలు జిల్లా పోలీసులు పుల్లూరు టోల్‌గేట్‌ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. అయితే.. ఏదైనా ఆసుప‌త్రిలో ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయ‌ని, చేర్చుకుంటామ‌ని హామీ ఇస్తే అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడతామని పోలీసులు స్పస్టంచేస్తున్నారు. అయితే.. తెలంగాణలో కోవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం పలు రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల వాహనాలపై ఆంక్షలు విధించినట్లు పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Young Doctor Dies: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం.. కూర్చున్నచోటే కుప్పకూలిన యువ డాక్టర్.. గంటల వ్యవధిలో గాలిలో కలిసిన ప్రాణాలు

Azam Khan: ఎంపీ అజామ్ ఖాన్, ఆయన కుమారుడికి కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు