Azam Khan: ఎంపీ అజామ్ ఖాన్, ఆయన కుమారుడికి కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

Azam Khan - Covid-19 positive: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు జైళ్లల్లో

Azam Khan: ఎంపీ అజామ్ ఖాన్, ఆయన కుమారుడికి కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
Azam Khan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 10, 2021 | 11:18 AM

Azam Khan – Covid-19 positive: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు జైళ్లల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఎంపీ అజామ్ ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మే 2నే ఆసుపత్రిలో చేర్పించేందుకు జైలు అధికారులు ప్రయత్నించగా.. అజామ్ ఖాన్ నిరాకరించారు. ఈ క్రమంలో వారి పరిస్థితి మరింత విషమించడంతో.. జైలు అధికారులు లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. అజామ్ ఖాన్‌కు వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు.

34 కేసుల్లో నిందితులుగా ఉన్న అజామ్ఖాన్, ఆయన భార్య, కుమారుడు అబ్దుల్లా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో అలహాబాద్ కోర్టు అజామ్ ఖాన్ భార్య తజీన్ ఫాత్మాకు ఇటీవలనే బెయిల్ మంజూరు చేసింది. గత నెల 30వతేదీన జైల్లో ఉన్న తండ్రీకొడుకులు ఆజంఖాన్, అబ్దుల్లా ఖాన్ లకు కరోనా సోకింది. వారితోపాటు మరో 13 మంది ఖైదీలకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Also Read:

Sadiq Khan: లండ‌న్ మేయ‌ర్‌గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఎన్నిక.. వరుసగా రెండోసారి..

వ్యాక్సిన్ పాలసీలో జుడిషియల్ జోక్యం తగదు.,, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ, ప్రభుత్వ నిర్ణయాలే ముఖ్యమని వివరణ

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!