AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ పాలసీలో జుడిషియల్ జోక్యం తగదు.,, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ, ప్రభుత్వ నిర్ణయాలే ముఖ్యమని వివరణ

కోవిద్ వ్యాక్సిన్ విషయంలో తాము అనుసరిస్తున్న పాలసీని కేంద్రం సమర్థించుకొంది. ఈ అంశంపై జ్యూడిషియల్ జోక్యం తగదని కోరింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్ లో ఈ మేరకు పేర్కొంది.

వ్యాక్సిన్ పాలసీలో జుడిషియల్ జోక్యం తగదు.,, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ, ప్రభుత్వ నిర్ణయాలే ముఖ్యమని వివరణ
No Judicial Interference Says Centre In Supreme Court
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 10, 2021 | 10:24 AM

Share

కోవిద్ వ్యాక్సిన్ విషయంలో తాము అనుసరిస్తున్న పాలసీని కేంద్రం సమర్థించుకొంది. ఈ అంశంపై జ్యూడిషియల్ జోక్యం తగదని కోరింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్ లో ఈ మేరకు పేర్కొంది. నిపుణులైన వైద్య సిబ్బందితో చర్చించి శాస్త్రీయంగా తాము ఈ విధానాన్ని పాటిస్తున్నామని, తదనుగుణంగా తీసుకునే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) నడచుకుంటోందని వివరించింది. ఉన్నత స్థాయిలో జరిగిన, జరుగుతున్న చర్చలే ఈ పాలసీకి ప్రాతిపదిక అని వివరించింది., ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ విధమైన అంశాలను ఎగ్జిక్యూటివ్ కే వదిలివేయాలని, దయచేసి మా నిర్ణయాలకు అడ్డు రాకండని కేంద్రం అభ్యర్థించింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలు, వ్యాక్సిన్ డోసుల కొరత, టీకామందుల పంపిణీలో జాప్యం వంటి వివిధ అంశాలపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో కేంద్రం.. ఇలా తన పాలసీ సక్రమమే అని వివరించడానికి ప్రయత్నించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలు వేర్వేరుగా ఉంటున్న సంగతి విదితమే.. వీటిని డోసుకు 150 రూపాయల చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తుండగా రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ కంపెనీలు అమ్ముతున్న ధరలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ సంస్థలు ఇష్టం వఛ్చినట్టు ధరలను నిర్ణయించాయని పిటిషన్ దారులు తమ పిటిషన్ లో ఆరోపించారు. పైగా ప్రభుత్వం వ్యాక్సిన్ అమ్మకాలతో లాభం పొందాలనుకుంటోందని కాంగ్రెస్ వంటి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మొదటిసారిగా కేంద్రం సుప్రీంకోర్టులో ఇలా వాదించడం ఇదే మొదటిసారి. ఈ జాతీయ సంక్షోభ సమయంలో తాము మౌన ప్రేక్షక పాత్ర వహించజాలమని, వ్యాక్సిన్ పాలసీకి సంబంధించి కేంద్రం సమగ్ర వ్యూహం రూపొందించాలని గత నెలలో సుప్రీంకోర్టు దాదాపు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టులు వహిస్తున్న పాత్ర ప్రశంసనీయంగా ఉందని కూడా పేర్కొంది. అయితే దానిపై అప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు తన వాదనను స్పష్టంగా వినిపించింది. తాము తీసుకునే నిర్ణయాల్లో కోర్టుల జోక్యం ఉండరాదని సూచించింది. మరి దీనిపై కోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.. మరిన్ని చదవండి ఇక్కడ :  Thank You Brother: ఓటీటీలో కూడా తగ్గని జబర్ధస్ అనసూయ హవా .. ( వీడియో ) Viral Video: భార్య,అమ్మ నగలు తాకట్టు పెట్టి.. కొవిడ్‌ ఆస్పత్రి.. నెట్టింట వైరల్… ( వీడియో )