బెరైలీలో తీవ్ర ఆక్సిజన్ కొరత..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కేంద్ర మంత్రి లేఖ, బ్లాక్ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన
యూపీలోని తన బెరైలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉందని, కొందరు వెంటిలేటర్లు, ఇతర కోవిడ్ మందులను బ్లాకులో అమ్ముకుంటున్నారని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ఆరోపించారు...
యూపీలోని తన బెరైలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉందని, కొందరు వెంటిలేటర్లు, ఇతర కోవిడ్ మందులను బ్లాకులో అమ్ముకుంటున్నారని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ఆరోపించారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రాసిన లేఖలో ఆయన.. మీ ఆరోగ్య శాఖ అధికారులకు ఈ విషయమై ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు రిసీవ్ చేసుకోవడంలేదని అన్నారు. సాక్షాత్తూ ఒక కేంద్ర మంత్రి ఆక్సిజన్ కొరత, బ్లాక్ మార్కెటింగ్, అధికారుల అలసత్వం తదితర విషయాలపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. తమ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, వదంతులు ఎవరు వ్యాప్తి చెందింప జేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే హెచ్చరించారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోతోంది. ఈ కోవిడ్ తరుణంలో అనేకమంది పార్టీల నేతలతో సహా ఆక్సిజన్ సిలిండర్లను, కోవిద్ మందులను అక్రమంగా దాస్తున్నారని, బ్లాక్ మార్కెట్ లో అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాగా బెరైలీ లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, కోవిడ్ రోగుల రెఫరింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేయాలని సంతోష్ గంగ్వార్ తన లేఖలో అభ్యర్థించారు. నా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై స్పందించి వీటిపై తగిన చర్యలు తీసుకోండి అని ఆయన కోరారు. తనకు వివిధ వర్గాల ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పురస్కరించుకుని మీకు ఈ లేఖ రాస్తున్నానని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కొరత సహజమేనని, కానీ ఈ సమయంలో ప్రాణాధార మందులు తదితరాలను బ్లాక్ మార్కెట్ చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. బెరైలీ నియోజకవర్గంలో గత 24 గంటల్లో 736 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 6,387 కేసులు ఉన్నాయి. మరిన్ని చదవండి ఇక్కడ : Vijay Deverakonda Liger teaser postponed:విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. లైగర్ టీజర్ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో) ఐసొలేషన్ లో సింహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? జంతువులను సైతం వదలని కరోనా మహమ్మారి: Lions viral video.