నీరవ్ మోడీ అప్పీలుకు అనుమతిపై లండన్ హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయమే తరువాయి.. ఇప్పట్లో భారత్ కు అప్పగింత అనుమానమే

ఇండియాకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత వ్యవహారం ఇంకా అక్కడి కోర్టుల్లో నలుగుతూనే ఉంది. తనను ఇండియాకు అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీలు దాఖలు..

నీరవ్ మోడీ అప్పీలుకు అనుమతిపై లండన్ హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయమే తరువాయి.. ఇప్పట్లో భారత్ కు అప్పగింత అనుమానమే
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2021 | 12:41 PM

ఇండియాకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత వ్యవహారం ఇంకా అక్కడి కోర్టుల్లో నలుగుతూనే ఉంది. తనను ఇండియాకు అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేయడానికి ఆయన మళ్ళీ లండన్ హైకోర్టుకెక్కాడు. ఆయన పెట్టుకున్న దరఖాస్తుపై జడ్జి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల మేర మోసగించి లండన్ చెక్కేసిన నీరవ్.ను భారత్ కు అప్పగించాలని బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ గత నెలలో ఆదేశించారు. అలాగే వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ కూడా ఆదేశించింది. అయితే తన మెంటల్ కండిషన్ బాగులేదని ఆయన మళ్ళీ ‘కొర్రీ’పెట్టాడు. ఆయన అప్పీలు కోసం అనుమతిని కోరుతూ దరఖాస్తు పెట్టిన విషయం నిజమేనని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు ధృవీకరించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే హైకోర్టు జడ్జి ఈ దరఖాస్తును ఇంకా పరిశీలించాల్సి ఉందని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఆ న్యాయమూర్తి పరిశీలనకు ఇది ఇంకా వెళ్లలేదని అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆఫ్ ది రాయల్ కోర్ట్స్ (లండన్) పేర్కొంది.హోం మంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా అన్న అంశాన్ని జడ్జి పరిశీలించాల్సి ఉంటుంది.ఫ్రాడ్,మనీ లాండరింగ్ ఆరోపణలకు గురైన నీరవ్ మోడీని ఇండియాకు అప్పగించాలని కోర్టు ఆదేశించినా..వీటిని ఏ విధంగానైనా అడ్డుకునేందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. జడ్జి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ వాదన వినిపించేందుకు మౌఖిక విచారణ జరగాలని డిఫెన్స్ న్యాయవాదులు కోరుతున్నారు. కానీ ఇందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఏదీ లేదు. ఈ ప్రాసెస్ కొన్ని నెలలు పట్టినా పట్టవచ్చు అని తెలుస్తోంది. అప్పీలు దాఖలుకు అనుమతి లభిస్తుందా అని తాము వేచి ఉన్నామని ఇందుకు జడ్జి అనుమతిస్తే భారత ప్రభుత్వం తరఫున దాఖలయ్యే ఏ అప్పీలు ప్రొసీడింగుల నైనా తాము సవాలు చేస్తామని ఈ న్యాయవాదులు పేర్కొన్నారు.

నీరవ్ మోడీ ఇంకా లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మరిన్ని చదవండి ఇక్కడ : Vijay Deverakonda Liger teaser postponed:విజయ్‌ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. లైగర్‌ టీజర్‌ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో) ఐసొలేషన్ లో సింహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? జంతువులను సైతం వదలని కరోనా మహమ్మారి: Lions viral video.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..