ట్రీట్‌మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే..
Rahul Vokra: వెబ్ సిరీస్ నటుడు రాహుల్ వోహ్రా కరోనాతో ఆదివారం ఉదయం కన్నుముశారు. మెరుగైన చికిత్స లభిస్తే తప్పకుండా బతుకుతాను
Rahul Vokra: వెబ్ సిరీస్ నటుడు రాహుల్ వోహ్రా కరోనాతో ఆదివారం ఉదయం కన్నుముశారు. మెరుగైన చికిత్స లభిస్తే తప్పకుండా బతుకుతాను అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆయన మరణించారు. ఈయనకు ఫేస్ బుక్ లో 1.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మే 4న స్వయంగా ఆయనే తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలియజేశారు.
కరోనా సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. కానీ కోలుకోలేకపోతున్నాను. ఆక్సిజన్ లెవల్స్ క్రమక్రమంగా తగ్గిపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన బాగోగుల చూసుకునే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ అందుబాటులో ఉంటే చెప్పండి అని అభ్యర్థించాడు. ఫ్యామిలీ కూడా టచ్ లో లేదని.. అందుకే ఈ పోస్ట్ పెడుతున్నట్లు వివరించాడు. ఇక తన పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం మరో పోస్ట్ పెట్టాడు రాహుల్.. “నాకు మంచి ట్రీట్‌మెంట్ అందితే ప్రాణాలతో బయటపడతాను. నిజంగా ఇది జరిగి తీరితే నాకు పునర్జన్మ దొరికినట్లే లెక్క” అని చెప్పుకొచ్చాడు. ఇలా పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆయన చనిపోయాడంటూ డైరెక్టర్ అరవింద్ గౌర్ సోషల్ మీడియాలో తెలిపారు. “మంచి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉందని ఆశపడ్డాడు. వెంటనే అతడిని వేరే ఆస్పత్రికి షిఫ్ట్ చేశాం, కానీ బతికించలేకపోయాం..” అని ఎమోషనల్ పోస్ట్ చేసారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాలతో ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందండిలా..