AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggupati: శుభం కార్డు వేసిన రానా.. నెంబర్‌ వన్ యారీ సీజన్ 3కి ముగింపు పలికిన భల్లాల దేవా..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన రానా.. బుల్లి తెరకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. కొంత కాలంగా నెంబర్‌ వన్‌ యారీ సీజన్ 3

Rana Daggupati: శుభం కార్డు వేసిన రానా.. నెంబర్‌ వన్ యారీ సీజన్ 3కి ముగింపు పలికిన భల్లాల దేవా..
Rana
Rajitha Chanti
|

Updated on: May 10, 2021 | 8:02 AM

Share

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన రానా.. బుల్లి తెరకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. కొంత కాలంగా నెంబర్‌ వన్‌ యారీ సీజన్ 3 అంటూ ప్రేక్షకులను పలకరించిన రానా… ఇప్పుడు ఆ షోకు శుభం కార్డు వేశారు. తిరిగి మరో సీజన్‌తో అతి తొందర్లో మీ ముందుకు వస్తా నంటూ.. షో ముగించారు.

టాలీవుడ్ హంక్‌ రానా ఇటు సినిమాలు తీస్తూనే ఓటీటీ వేదికల మీద నెంబర్‌ వన్‌ యారీ అంటూ.. హడావిడి చేసేవారు. టాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకువచ్చి వారితో గేమ్స్‌ ఆడిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేవారు. ఇలా విజయవంతంగా రెండు సీజన్‌లు పూర్తి చేసుకున్న రానా.. ఆ తరువాత మూడో సీజన్‌తో “ఆహా” వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. కానీ ఇప్పుడు కోవిడ్‌ పరిస్థితులు చేయి దాటుతుండడంతో ఈ సీజన్‌ను ముగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మే 10న జరగబోయే షోనే ఈ సీజన్‌ను చివరిదంటూ.. చెప్పేశారు.

“ఈరోజుతో ఈ సీజన్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాను. బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకందరికీ తెలుసు.. మనకు తెలిసి ఇదే అత్యంతదారుణమైన పరిస్థితి. అందుకే ఈ సీజన్‌ను ముగిస్తున్నాను. మా టీం అందరికీ.. షోకి వచ్చిన సెలబ్రిటీలందరికీ థాంక్యూ” అని షో ప్రారంభమయ్యే ముందు చెప్పారు. అంతేకాదు.. “ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాయం అందిస్తున్న ప్రంట్‌ లైన్‌ వర్కర్లకు, డాక్టర్లకు, పోలీసులకు, సోషల్ వర్కర్లకు థాంక్యూ.. కానీ వాళ్లు ఎంత చేసినా.. మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. అందరూ ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి.” అంటూ.. షోను ప్రారంభించారు రానా. ఇక సీజన్3లో చివరిదైన ఈ ఎపిసోడ్‌కు ఉప్పెన జంట వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి జంటగా విచ్చేశారు. రానా అడిగే ప్రశ్నలకు క్యూటుగా సమాధానాలు చెబుతూ.. మరో సారి అందర్నీ ఆకట్టుకున్నారు.

Also Read: సుధ కొంగర చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే.. పాన్ ఇండియా స్టార్‏తో సినిమా చేయనున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

Happy Birthday Namitha: హీరోయిన్ నమిత పుట్టిన రోజు నేడు.. ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..