సుధ కొంగర చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే.. పాన్ ఇండియా స్టార్‏తో సినిమా చేయనున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

ఆకాశం నీ హద్దురా అంటూ.. తెలుగమ్మాయి చూపించిన టాలెంట్.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఓ సెన్షేషన్. రెండు చోట్లా మూవీ.. బిగ్గెస్ట్ హిట్ సాధించింది.

సుధ కొంగర చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే.. పాన్ ఇండియా స్టార్‏తో సినిమా చేయనున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
Sudha Kongara
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2021 | 6:25 AM

ఆకాశం నీ హద్దురా అంటూ.. తెలుగమ్మాయి చూపించిన టాలెంట్.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఓ సెన్షేషన్. రెండు చోట్లా మూవీ.. బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీ డైరెక్టర్ సుధా కొంగర.. మన తెలుగు స్టార్ తో ఓ మూవీ చేయబోతున్నారు..? ఎవరా హీరో..? తెలుగమ్మాయికి అవకాశం ఇవ్వనున్న ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు..? తెలుసుకుందామా..

సుధా కొంగర.. మన తెలుగమ్మాయే. మణిరత్నం టీమ్ లో ఏడేళ్లు పనిచేసిన ఈమే.. ఎంట్రీతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మాధవన్ హీరోగా సాలా ఖడూస్ మూవీతో.. ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. ఇది హిట్ కావడంతో.. తెలుగులో వెంకటేశ్ తో.. రీమేక్ మూవీ గురు చేసింది. స్వతహాగా రచయిత అయిన సుధా.. ఈ సారి తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య ప్రిన్స్ మహేశ్ బాబుతో మూవీ చేయాలని అనుకున్నట్లు.. కథనాలు వచ్చాయి. అయితే తాజాగా రివీల్ అయిన బజ్ ఏంటంటే.. సుధా కొంగర తర్వాత మూవీ ప్రభాస్ తో చేస్తుందట. ఇటీవల ప్రభాస్ ను కలిసిన సుధాకొంగర.. ఓ సోషల్ డ్రామా కథను నెరేట్ చేశారట. అయితే స్టోరీ లైన్ నచ్చిన ప్రభాస్.. పూర్తి కథను సిద్ధం చేయాలని సూచించారట. మొత్తం కథ విన్నాక.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేతిలో వరుస మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసినా.. సెట్స్ మీదికి వెళ్లడానికి మరో రెండేళ్లు ఆగాల్సిందే.

Also Read: చరణ్- శంకర్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వింక్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో జోడీ కట్టనున్న ప్రియా ప్రకాశ్ వారియర్…

Mail Movie: అరుదైన ఘనత సాధించిన ‘మెయిల్’.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..