Mail Movie: అరుదైన ఘనత సాధించిన ‘మెయిల్’.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..

2005 అప్పుడప్పుడే పల్లెల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు. ఆ గ్రామంలో కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న యువకుడు.

Mail Movie: అరుదైన ఘనత సాధించిన 'మెయిల్'.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..
Mail
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2021 | 5:14 PM

2005 అప్పుడప్పుడే పల్లెల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు. ఆ గ్రామంలో కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న యువకుడు. ఇక అదే సమయంలో ఆ ఊర్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభం అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కుర్రాడు జాయిన్ అవుతాడు. ఇక అక్కడున్న కోచింగ్ సెంటర్ యాజమాని ఆ అబ్బాయికి ఒక మెయిల్ క్రియేట్ చేస్తాడు. ఇక అంతే ఆ మెయిల్ వలన అబ్బాయి జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఆ యాజమానిది. ఇక అదే.. కంబాల కథలు.. మెయిల్. ఆహా వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనుసును హత్తుకోవడమే కాకుండా.. ఘన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు మెయిల్ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కు సెలక్ట్ అయ్యింది. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ఆ చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపాకు. జూన్‌ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించారు. ప్రియాంక దత్ ఈ నిర్మతగా వ్యవహరించారు.

ట్వీట్..

Also Read: విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

Anil Ravipudi : బాలయ్య తో సినిమా మాములుగా ఉండదంటున్న అనీల్ రావిపూడి.. క్లారిటీ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్…