విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: May 09, 2021 | 3:58 PM

Vijay Devarakonda: కరోనా సెకండ్ వేవ్.. ఇప్పటివరకు సినిమా విడుదలకు, షూటింగ్స్‏కు మాత్రమే అడ్డుపడింది. కానీ తాజాగా ఈ మహమ్మారి

విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..
Liger

Vijay Devarakonda: కరోనా సెకండ్ వేవ్.. ఇప్పటివరకు సినిమా విడుదలకు, షూటింగ్స్‏కు మాత్రమే అడ్డుపడింది. కానీ తాజాగా ఈ మహమ్మారి టీజర్ విడుదలకు కూడా అడ్డుగా నిలిచింది. దీంతో ఆ స్టార్ హీరో అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? కరోనాతో టీజర్ రాకపోవడం ఎంటీ ? అనుకుంటున్నారా.. అయితే అసలు విషయం తెలుసుకుందాం.

స్టార్ హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు.. ఆరోజుల తప్పకుండా స్పెషల్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆరోజు ఆయా హీరోల కొత్త సినిమాలకు సంబంధించి ఆప్ డేట్, ఫోస్టర్, టీజర్స్ రావడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మే 9 విజయ్ దేవరకొండ పుట్టినరోజు. అయితే ఈరోజున విజయ్ లేటెస్ట్ చిత్రం లైగర్ మూవీ టీజర్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ వారిని నిరాశపరుస్తూ.. టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పూరీ టీం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ముందుగా మే9 న లైగర్ పవర్ ప్యాక్ట్ టీజర్ విడుదల చేద్దామనుకున్నాం. కానీ ఈ సంక్షోభ సమయంలో టీజర్ విడుదల చేయడం కన్నా, వాయిదా వేయడమే మంచిదనిపించింది. త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం. మేము మీకు మాటిచ్చినట్లుగానే విజయ్‌ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఆయన లుక్స్‌, డైలాగ్స్‌ పట్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉండదు. దయచేసి ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. శుభ్రత పాటించండి. మీ వాళ్లని ఆరోగ్యంగా చూసుకోండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. ధైర్యంగా ఉండండి అంటూ పూరీ టీం ఇన్ స్టా వేదికగా తెలిపింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఛార్మీ, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్వీట్..

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

Also Read: Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

Happy Mothers Day: ‘హ్యప్పీ మథర్స్ డే’.. డిఫరెంట్ వీడియోతో విషెష్ చెప్పిన ఆర్జీవి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu