AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

SonuSood: లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలు.. తమ సొంతూళ్లకు చేరుకోవడానికి సహయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..
Sonusood
Rajitha Chanti
|

Updated on: May 09, 2021 | 3:23 PM

Share

SonuSood: లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలు.. తమ సొంతూళ్లకు చేరుకోవడానికి సహయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కేవలం రవాణా సౌకర్యాలు మాత్రమే కాకుండా.. వారు బ్రతకడానికి కావాల్సిన సరుకులు, నగదు రూపంలో అనేక విధాలుగా సాయాన్ని అందించి.. పేదవారికి దేవుడిలా కనిపించాడు. అందుకే సోనూసూద్‏కు గుడి కట్టి పూజలు చేస్తున్నారు కొందరు. కరోనా వైరస్ ప్రవేశించి సంవత్సరా కాలం పూర్తైంది. కానీ సోనూ సూద్ సహాయాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ అడిగిన వారికి లేదనకుండా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతాలకుతులం చేస్తోంది. ఈ సమయంలో సినీ నటుడు సోనూసూద్ ప్రభుత్వం కంటే వేగంగా పని చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు సాయం అడిగినా కూడా వెంటనే స్పందించి తనకు సాధ్యం అయినంత వరకు సాయం చేస్తూ వస్తున్నాడు. ప్రముఖులు కూడా సోనూ సూద్ నుండి సాయం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో క్రికెటర్ రైనా తన ఆంటీకి ఆక్సీజన్ సిలిండర్ అవసరం అంటూ పోస్ట్ పెట్టగానే ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ అందించాడు సోనూసూద్.

తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్‏ కూడా సోనూను హెల్ప్ కావాలంటూ వేడుకున్నాడు. వెంకట రమణ అనే పేషంట్ కు మందులు, అత్యవసర కిట్ అవసరం అంటూ మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా సోనూను అభ్యర్థించాడు. దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్.. మెహర్ రమేష్ అడిగిన మందులు మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను సోనూసూద్ కేవలం 24 గంటల లోపులో సమకూర్చాడు. దీంతో తనకు అందిన సాయంను మెహర్ రమేష్ మళ్లీ ట్వీట్ చేశాడు. వెంకట రమణ కు సోనూసూద్ చేసిన సాయంను మెహర్ రమేష్ చూపించాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి సంభాషణ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా.. మెహర్ రమేష్.. చిరంజీవితో వేదాళం రీమేక్ చేయనున్నాడు. త్వరలోనే వీరిద్ధరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.

ట్వీట్..

Also Read: Happy Mothers Day: ‘హ్యప్పీ మథర్స్ డే’.. డిఫరెంట్ వీడియోతో విషెష్ చెప్పిన ఆర్జీవి..