వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వింక్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో జోడీ కట్టనున్న ప్రియా ప్రకాశ్ వారియర్…

Priya Prakash Varrier: ప్రియా ప్రకాశ్ వారియర్.. మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' తోనే ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వింక్ బ్యూటీ..  ఆ స్టార్ హీరో కొడుకుతో జోడీ కట్టనున్న ప్రియా ప్రకాశ్ వారియర్…
Priya Varrier

Priya Prakash Varrier: ప్రియా ప్రకాశ్ వారియర్.. మొదటి సినిమా ‘ఒరు అదార్ లవ్’ తోనే ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం ఒక సీన్ లో కన్ను గీటుతూ ప్రియా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు ఫెవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఈ అమ్మాడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా.. ప్రియాకు మాత్రం మంచి గుర్తింపే లభించింది. ఇటీవల ఈ బ్యూటీ టాలీవుడ్ లో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ప్రియా భారీగాన అంచనాలు పెట్టుకుంది. కానీ ఆమెను ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఇక ఈ మధ్యే హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తేజతో కలిసి ‘ఇష్క్’ అనే సినిమా చేసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక పరిస్థితులు ఏలా ఉన్నాగానీ ప్రియాకు మాత్రం ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

తాజాగా ఈ వింక్ బ్యూటీ ఓ సూపర్ హిట్ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ నటించే తదుపరి సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించనుందట. ధృవ్ ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన తండ్రి చేస్తున్న 60వ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా ధృవ్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మురగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో చేయనున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఆ సినిమాలో వింక్ బ్యూటీ ప్రియా వారియర్‌ని అనుకుంటున్నారట.ఇప్పటికే వీరిద్ధరి మధ్య కావాల్సిన ఫోటో షూట్ కూడా జరిగిపోయిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

Also Read: ట్రీట్‏మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే..

Mail Movie: అరుదైన ఘనత సాధించిన ‘మెయిల్’.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..