చరణ్- శంకర్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..

RamCharan Shankar Movie Gossip: సినీ పరిశ్రమలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో శంకర్ ఒకరు. పాన్ ఇండియా డైరెక్టర్‏గా

చరణ్- శంకర్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..
Ram Charan Shankar

RamCharan Shankar Movie Gossip: సినీ పరిశ్రమలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో శంకర్ ఒకరు. పాన్ ఇండియా డైరెక్టర్‏గా మారిన శంకర్ ఇప్పటివరకు తెలుగులో ఏ ఒక్క స్టార్ హీరోతోనూ నేరుగా సినిమా చేయలేదు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమాను దిల్ రాజ్ నిర్మించబోతున్నట్లుగా సమాచారం. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే చరణ్ శంకర్ సంబంధించి ఎదో ఒక వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్తే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ సుదీప్ ను తీసుకుబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సైతం సుదీప్ దీనిపై సానుకూలంగా స్పందించడం విశేషం. శంకర్- చరణ్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు. మరి ఈ చర్చలు గనుక సఫలమైతే శంకర్ -చరణ్ ద్వయానికి సుదీప్ బిగ్ అస్సెట్ అనే చెప్పాలి. ఇంతకుముందు సుదీప్ మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహ రెడ్డిలో నటించాడు. మరీ ఈసారి చెర్రి, శంకర్ సినిమాలోనూ అతడి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వింక్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో జోడీ కట్టనున్న ప్రియా ప్రకాశ్ వారియర్…

ట్రీట్‏మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే..

విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..