- Telugu News Photo Gallery Cinema photos Actress namitha birthday today you know these interesting details her
Happy Birthday Namitha: హీరోయిన్ నమిత పుట్టిన రోజు నేడు.. ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన చిత్రం సొంతం. ఈ సినిమాతోనే నమిత హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు ఒక రాణి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఈరోజు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు.
Updated on: May 10, 2021 | 7:29 AM

నమిత 1980 మే 10న గుజరాత్లోని సూరత్ పట్టణంలో జన్మించింది. 1998లో మిస్ సూరత్గా 2001 మిస్ ఇండియా పోటీల్లో నాలగవ స్థానంలో నిలిచింది.

ఆర్యన్ రాజేష్ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కించిన సొంతం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు ఒక రాణి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత.

సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కానీ.. నమితకు మాత్రం ఆఫర్లు అంతగా రాలేదు. ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు వంటి సినిమాల్లో నటించింది నమిత.

ఆ తర్వాత చాలా వరకు ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. అందుకు కారణం నమితి ఆకస్తాత్తుగా బొద్దుగా మారిపోవడమే.

కొంతకాలం బ్రేక్ తీసుకున్న తర్వాత నమిత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

కేవలం తెలుగులోనే కాకుండా.. అటు కన్నడ, మాలయాళం, తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత.

2017లో వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది ఈ బొద్దుగుమ్మ.




