వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాలతో ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందండిలా..
గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంతో అన్ని వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసాయి. ఇక ఆ తర్వాత క్రమంగా కోవిడ్ కేసులు తగ్గడంతో తిరిగి మళ్ళీ ఆఫీసులు తెరుచుకున్నాయి.
గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంతో అన్ని వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసాయి. ఇక ఆ తర్వాత క్రమంగా కోవిడ్ కేసులు తగ్గడంతో తిరిగి మళ్ళీ ఆఫీసులు తెరుచుకున్నాయి. ఇక తాజాగా మరోసారి కరోనా సెకండ్ వేవ్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. దీంతో వర్క్ ఫ్రమ్ హోం విధానం మళ్లీ అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. ఇక ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో తెలియదు. ఇప్పుడప్పుడే కరోనా తగ్గేలా లేదు కాబట్టి మరిన్ని రోజులు ఇదే కొనసాగుతూ ఉండవచ్చు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కోంటుంటారు. అలాగే మెదడుపై ఒత్తిడి పెరగడమే కాకుండా.. ఒకే చోట కూర్చోవడం వలన మెడ, నడుము, నరాలకి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వలన కలిగే ఇబ్బందులను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఎదురయ్యే అతి పెద్ద సమస్య బరువు పెరగడం. సరైన సమయానికి తినకపోవడం.. రోజూలో ఎక్కువ సార్లు తినడం వలన బరువు పెరిగిపోతుంటారు. బరువు పెరగకుండా ఉండేందుకు వ్యాయామం చేయడం ఉత్తమం. రోజూ పొద్దున్న కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయడం ఉత్తమం. మానసిక సమస్యలు దూరం కావడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది. అలాగే ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వలన చాలా మందిలో కండరాలు, వెన్నునొప్పి సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి వెన్నుపూసను వంచుతూ కూర్చుకోకుడదు. నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కూర్చున్న చోటు నుంచి అటు ఇటూ ఓ రెండు నిమిషాల పాటు నడవాలి.
అలాగే ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కళ్ళమీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. కంప్యూటర్ తెర నుంచి వచ్చే బ్లూ లైట్ హాని కలిగిస్తుంది. అందుకే కళ్లకి సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి కంప్యూటర్ ముందు నుండి తప్పుకుని ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువుని చూస్తూ ఇరవై సెకన్ల పాటు రెప్పలు ఆర్పాలి.
Also Read: Mail Movie: అరుదైన ఘనత సాధించిన ‘మెయిల్’.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..