AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..! అయితే పుదీనతో ఇలా చేయండి.. వెంటనే మీ సమస్య క్లియర్..

Health Benefits Pudina : ఆయుర్వేదంలో పుదీనా చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. ఇది రుచి, మంచి వాసన కలిగి

నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..! అయితే పుదీనతో ఇలా చేయండి.. వెంటనే మీ సమస్య క్లియర్..
Pudina
uppula Raju
|

Updated on: May 09, 2021 | 3:17 PM

Share

Health Benefits Pudina : ఆయుర్వేదంలో పుదీనా చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. ఇది రుచి, మంచి వాసన కలిగి ఉంటుంది. పుదీనాను 12 నెలలు ఎప్పుడైనా వాడవచ్చు. ఇది ఎల్లప్పుడూ సుగంధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుదీన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాడ్ బ్రీతింగ్ సమస్యకు పుదీన చక్కటి పరిష్కారం. 4-5 పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టి చల్లబరిచి ఆ నీటితో శుభ్రం చేసుకోండి. నోటి వాసన మాయమవుతుంది.

ప్రతిరోజు పుదీన ఆకులు తినడం వల్ల దంత సమస్యలు రావు. చిగుళ్ల రక్తస్రావం నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులను పేస్ట్‌గా చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి. పుదీన తినడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. పుదీనా టీ తాగడం వల్ల బ్రెయిన్ రీ ఫ్రెష్ అవుతుంది. అలసట నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. తేనెతో కలిపి పుదీనా రసం తీసుకుంటే ఎక్కిళ్ళ సమస్య తొలగిపోతుంది. దగ్గుతో బాధపడుతుంటే పుదీనా ఆకులను టీతో కలిపి తీసుకుంటే సమస్య నుంచి బయటపడతారు.

కడుపులో నొప్పి ఉంటే, అల్లం, పుదీనా రసంలో కొద్దిగా రాక్ ఉప్పును కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోండి. శరీర నొప్పులు తొలగిపోతాయి. దీంతో పాటు ఆర్థరైటిస్ సమస్య కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా పుదీన ఆకలి పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పుదీన దివ్యఔషధంలా పనిచేస్తుంది. సనాతన ఆయుర్వేద వైద్యులు పుదీనతో చాలా ఔషధాలను తయారు చేస్తారు.

DGP Gowtham Sawang: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు కీలక సూచనలు చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్..

కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చాలి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Mahesh Babu: మహేష్ -రాజమౌళి సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..