DGP Gowtham Sawang: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు కీలక సూచనలు చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్..
DGP Gowtham Sawang: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
DGP Gowtham Sawang: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రెండు మాస్క్ ధరలించాలని, శానిటైజర్‌ను ఉపయోగించాలని సూచించారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లినప్పుడు కూడా తప్పకుండా రెండు మాస్క్‌లు ధరించాలన్నారు. మాస్క్ ధరించడం ద్వారా మీ ప్రాణాలతో పాటు.. ఎదుటివారి ప్రాణాలను సైతం కాపాడుతుందన్నారు. అందరూ తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాని సమర్థవంతంగా జయించవచ్చునని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
కరోనా లక్షణాలను గుర్తించిన, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. కరోనా నిబంధనలను, లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి అందించాలని ప్రజలకు డీజీపీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే.. నిబంధనల మేరకు వాహనాల జప్తు కూడా ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. అంతర్రాష్ట్ర కదలికలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. బాధితులు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కి రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రజలను డీజీపీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎటువంటి రాజకీయ పార్టీల సభలు, సమావేశలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు.
నిర్ధారణ కాని వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అప్రమత్తంగా వ్యాహరించాలని ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ‘తగిన జాగ్రత్తలు తీసుకుందాం.. అందరం కరోనా మహమ్మారిని జయిద్దాం’ అని గౌతమ్ సవాంగ్ నినదించారు. ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం మీ రక్షణ కోసం మీ వెంటే ఉంటుంది. మీరందరూ పోలీస్ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.’ అని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
DGP Gowtham Sawang LIVE:
Also read:
కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చాలి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
Mahesh Babu: మహేష్ -రాజమౌళి సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Coronavirus: జనగాంలో పాక్షిక లాక్ డౌన్.. మధ్యాహ్నం 2 నుంచి అన్నీ క్లోజ్.. ఎప్పటివరకు అంటే