Coronavirus: జనగాంలో పాక్షిక లాక్ డౌన్.. మధ్యాహ్నం 2 నుంచి అన్నీ క్లోజ్.. ఎప్పటివరకు అంటే
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనగాం మున్సిపాల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మే 9 నుంచి...
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనగాం మున్సిపాల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మే 9 నుంచి పాక్షిక లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయించింది. పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచచాలని ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందని, కఠినతరమైన అంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది.
తాజాగా జనగాం మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమవేశం నిర్వహించింది. చైర్మన్ పోకల జమున అధ్యక్షతన పాలకవర్గం భేటీ అయింది. విపక్ష కౌన్సిల్ సభ్యులతో పాటు ఇతర సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాల్టీలో కరోనా విజృంభణపై విస్తృతంగా చర్చించారు. గత కొద్ది రోజులుగా మున్సిపల్ పరిధిలోని ౩౦ వార్డుల్లో కరోనా కేసులు అధికంగా నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రం కావడంతో నిత్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మున్సిపాల్టీలో వైరస్ ఉదృతి కొనసాగుతోందని సభ్యులు అభిప్రాయపడ్డారు. మున్సిపాల్టీలో నిత్యం వందల కొద్ది పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి పాక్షిక లాక్ డౌన్ విధించాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు మే 25వరకు అమలులో ప్రకటించారు.