సిగరెట్ పొగలో ‘దాగిన’ కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు, తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక

కోవిడ్ లక్షణాలున్న వ్యక్తి గాలి సరిగా లేని ఇరుకు గదిలో కూర్చుని సిగరెట్ తాగినా పక్కనోళ్ళకు ప్రమాదమే..ఆ సిగరెట్ పొగను పీల్చినవారు కూడా వైరస్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిగరెట్ పొగలో 'దాగిన' కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు,  తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక
Airborne Is Covid 19 Like C
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 09, 2021 | 2:17 PM

కోవిడ్ లక్షణాలున్న వ్యక్తి గాలి సరిగా లేని ఇరుకు గదిలో కూర్చుని సిగరెట్ తాగినా పక్కనోళ్ళకు ప్రమాదమే..ఆ సిగరెట్ పొగను పీల్చినవారు కూడా వైరస్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఆ వ్యక్తి తనతో బాటు ఇతరులకు కూడా ఈ కోవిడ్ వైరస్ ని అంటిస్తున్నాడన్న మాట ! ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి డాక్టర్ అంబరీష్ సాత్విక్ ఇదే విషయాన్ని వివరిస్తూ.. ఇలాంటి కోవిడ్ పొగరాయుళ్ల సమీపంలో ఉన్నవారు మాస్కులు ధరించకపోతే అంతే సంగతులని అంటున్నారు. ఓ గదిలో ఒక గంట ముందు సిగరెట్ తాగి స్మోకర్ వెళ్లిన తరువాత కూడా ఆ గదిలో సిగరెట్ వాసన ఉంటుందని, వైరస్ ఇంకా ఉండే సూచనలు ఉన్నాయని భావించాలని ఆయన చెప్పారు. అందువల్ల ప్రతి చిన్న అంశాన్ని కూడా ఈ కోవిడ్ సమయంలో పట్టించుకోవలసిన అవసరం ఉందన్నారు. చాలామందికి మాస్కులు ఎలా ధరించాలన్న దానిపై ఇంకా అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. దీనిపై స్వచ్చంద సంస్థలు ప్రచార కార్యక్రమం వంటిదాన్ని నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు’.టీవీలు, రోడ్ల కూడళ్లలో కొన్ని సూచనలతో పోస్టర్లు ఏర్పాటు చేయవచ్చునని, బస్సులకు రెండు వైపులా ఇలాంటి పోస్టర్లతో ప్రచారం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. అటు-కోవిడ్ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. అంతమాత్రాన బయటకు ఎవరు వెళ్లినా సింపుల్ గా ఇన్ఫెక్షన్ కి గురవుతారని చెప్పలేమని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ తో కూడిన గాలిని పీల్చడం, రోగులను ముట్టుకోవడం, వైరస్ పార్టికల్స్ గల తుంపరలతో కూడిన వాయువును పీల్చడం వంటివాటి వల్ల ఇది సోకే ప్రమాదం ఉందన్నారు. కోవిద్ సోకిన వ్యక్తికి మూడు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉన్నాట్రాన్స్ మిషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని కూడా వీరు వివరించారు. కోవిద్ రోగి మాట్లాడుతున్నా, దగ్గినా, వ్యాయామం చేస్తున్నా.. ఏ పని చేస్తున్నా ఇతరులు జాగరూకతతో ఉండాలని వారు సెలవిచ్చారు. గాలిలో వైరస్ 30 నిముషాల నుంచి గంట వరకు ఉంటుందని వీరు పునరుద్ఘాటించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Udhayanidhi Stalin: ఈ కుర్రహీరో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లో రాణించబోతున్నాడా..

KGF 2 Movie : రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ ఛాప్టార్ 2 డ్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..