AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udhayanidhi Stalin: ఈ కుర్రహీరో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లో రాణించబోతున్నాడా..

సౌత్‌ ఇండస్ట్రీలో సినిమాలు పాలిటిక్స్‌ వేరు చేసి చూడలేం. సినిమాల్లో టాప్ పొజిషన్ అచీవ్‌ చేసిన చాలా మంది స్టార్స్‌ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు...

Udhayanidhi Stalin: ఈ కుర్రహీరో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లో రాణించబోతున్నాడా..
Uday Nidhi Stalin
Rajeev Rayala
|

Updated on: May 09, 2021 | 2:03 PM

Share

Udhayanidhi Stalin: సౌత్‌ ఇండస్ట్రీలో సినిమాలు పాలిటిక్స్‌ వేరు చేసి చూడలేం. సినిమాల్లో టాప్ పొజిషన్ అచీవ్‌ చేసిన చాలా మంది స్టార్స్‌ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అఫ్‌కోర్స్‌ సక్సెస్‌ అయిన వాళ్లు మాత్రం తక్కువే అనుకోండి. అయితే ఓ యంగ్ హీరో మాత్రం పొలిటికల్‌ ఎంట్రీతోనే సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నారట. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరుపున పోటిచేసి గెలిచారు ఉదయనిధి స్టాలిన్‌. స్టార్ వారసుడిగా తమిళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో… స్టార్ ఇమేజ్‌ సాధించలేకపోయినా… సక్సెస్‌ ఫుల్ హీరోగా మాత్రం పేరు తెచ్చుకున్నారు. అయితే… బేసిక్‌గా పొలిటికల్‌ ఫ్యామిలీ కావటంతో సినిమాల కన్నా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారు ఈ యువ నటుడు. అప్ప‌ట్లో తాత క‌రుణానిధి నిల‌బ‌డిన చెపాక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించాడు ఉద‌య‌నిధి స్టాలిన్‌. డీఎంకే  పార్టీ అధికారంలోకి రావ‌డంతో స్టాలిన్  మంత్రివ‌ర్గంలోకి ఉద‌య‌నిధిని తీసుకునే అవ‌కాశం కూడా క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఉద‌య‌నిధి స్టాలిన్ సినిమాల‌కు దూరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బంపర్‌ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి… తండ్రి స్టాలిన్‌ క్యాబినెట్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్‌… అందుకే ఇక మీదట ఆయన సినిమాల్లో కొనసాగే పరిస్థితి లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి నిజంగానే ఉదయనిధి సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారా..? చూడాలి మరి

మరిన్ని ఇక్కడ చదవండి :

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.

Ramyug web series : ట్రెండీ లుక్‌ లో రాముడు మరియు డిఫరెంట్ మేకోవర్ లో రావణుడు… నెటిజన్లు ఫైర్‌.. ( వీడియో )

I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..