Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిచూపులు సినిమాతో..

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2021 | 10:23 AM

Happy Birthday vijay devarakonda: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిచూపులు సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ యంగ్ హీరోకు ఈ రేంజ్‌క్రేజ్‌ రావడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్‌. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌కు ఆడియన్స్‌ ఫిదా అవ్వటంతో క్రేజ్‌ ఓ రేంజ్‌కు చేరింది. బాలీవుడ్‌లోనే రౌడీ బాయ్‌ క్రేజ్‌ మామూలుగా లేదు. నార్త్ స్టార్ కిడ్స్‌ కూడా విజయ్‌ ఫ్యాన్స్‌ లిస్ట్‌లో చేరిపోయారు. జూనియర్ అతిలోకసుందరి జాన్వీ కపూర్‌ నుంచి యంగ్ సెన్సేషన్‌ అలియా భట్‌ వరకు చాలా మంది క్యూటీస్‌ విజయ్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలనుందటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. దీంతో విజయ్‌ పేరు నార్త్‌లో కూడా మోతమోగిస్తోంది.

మిగతా హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు విజయ్‌ దేవరకొండ. తన సినిమా అప్‌డేట్స్‌, పర్సనల్ ట్రిప్స్‌ విశేషాలు కూడా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. దీనికితోడు సోషల్ రెస్పాన్సిబులిటీతో విజయ్‌ చేసే స్టేట్‌మెంట్స్‌ కూడా రౌడీ ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తున్నాయి. ఈ రోజు ఈ కుర్ర హీరో బర్త్ డే. సోషల్ మీడియా వేదికగా విజయ్ కు అభిమానులు, సినిమా తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోఉంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల టీజర్ విడుదలను వాయిదా వేశారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dimple Hayati : తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న డింపుల్ హయతి

Happy Birthday Sai Pallavi : అచ్చం తెలుగింటి పడుచుపిల్లలా ఆకట్టుకునే అందం.. సాయిపల్లవి

Mahesh Tweet: త‌ప్ప‌నిస‌రైతేనే బ‌య‌ట‌కు రావాలంటోన్న‌ ప్రిన్స్‌.. క‌రోనా వేళ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోన్న మ‌హేశ్‌..

Dhethadi Harika: డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన దేత్తడి హారిక.. వైరల్ అవుతున్న వీడియో..