Dimple Hayati : తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న డింపుల్ హయతి

గల్ఫ్, యురేఖ లాంటి చిన్న సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన డింపుల్‌ హయాతి ఇప్పుడు ఫుల్ బిజీ అవుతున్నారు.

Dimple Hayati : తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న డింపుల్ హయతి
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2021 | 9:16 AM

Dimple Hayati

గల్ఫ్, యురేఖ లాంటి చిన్న సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన డింపుల్‌ హయాతి ఇప్పుడు ఫుల్ బిజీ అవుతున్నారు. రెండు సినిమాల్లో లీడ్‌ రోల్స్‌లో చేసినా రాని గుర్తింపు ఈ బ్యూటీ ఒక్క పాటతోనే సాధించారు. ఏంటా పాట అనుకుంటున్నారా..?   హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఊర మాస్ గెటప్ లో అలరించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇక ఈ సినిమా సూపర్ హిట్టు నీహైటు అంటూ సాగే ఐటమ్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటలో డింపుల్ అందచందాలు కుర్రకారు మతిపోగోట్టాయి. ఈ పాటలో ఆడి పాడిన ఆ హాట్ బ్యూటీనే డింపుల్ హయాతి. అంతకు ముందే రెండు సినిమాలు చేసినా.. ఈ సాంగ్‌ తరువాతే అమ్మడి ఫేట్ మారిపోయింది. ఐటమ్‌ సాంగ్‌తో సక్సెస్‌ అయినా… వరుసగా హీరోయిన్స్‌ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రజెంట్ రవితేజ ఖిలాడీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు డింపుల్‌.

ఖిలాడీ రిలీజ్‌కు ముందే మరిన్ని సినిమాలు అమ్మడి కిట్టీలో పడిపోయాయి. తెలుగులోనే కాదు తమిళ, హిందీ లాంగ్వేజెస్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఈ డస్కీ బ్యూటీ. ఇప్పటికే హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తున్న డింపుల్‌… తమిళ్‌లో విశాల్‌ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..

Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..

Mahesh Tweet: త‌ప్ప‌నిస‌రైతేనే బ‌య‌ట‌కు రావాలంటోన్న‌ ప్రిన్స్‌.. క‌రోనా వేళ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోన్న మ‌హేశ్‌..

Charmi About Her Marriage: జీవితంలో అలాంటి త‌ప్పు చేయ‌నంటున్న ఛార్మీ.. పెళ్లి వార్త‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..