Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..

Janhvi kapoor: త‌మ పిల్ల‌లు జీవితంలో బాగా ఎద‌గాల‌ని ప్ర‌తీ ఒక్క‌రి పేరెంట్స్ కోరుకుంటారు. జీవితంలో తాము సాధించ‌లేనిదాన్ని త‌మ సంతానం ద్వారా నెర‌వేర్చుకోవాల‌ని ఆశిస్తుంటారు...

Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..
Janvi Kapoor
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2021 | 6:09 AM

Janhvi kapoor: త‌మ పిల్ల‌లు జీవితంలో బాగా ఎద‌గాల‌ని ప్ర‌తీ ఒక్క‌రి పేరెంట్స్ కోరుకుంటారు. జీవితంలో తాము సాధించ‌లేనిదాన్ని త‌మ సంతానం ద్వారా నెర‌వేర్చుకోవాల‌ని ఆశిస్తుంటారు. ఇది కేవ‌లం సామాన్యుల‌కే మాత్ర‌మే ప‌రిమితం కాదండోయ్‌.. సెల‌బ్రిటీలు సైతం త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తుపై ఎంతో ఆశ‌తో ఉంటారు. తాజాగా ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చింది అతిలోక సుంద‌రి శ్రీదేవీ త‌న‌య జాన్వీ క‌పూర్. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో జాన్వీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. శ్రీదేవీకి త‌న కూతురు జాన్వీ క‌పూర్ డాక్ట‌ర్‌గా ఎద‌గాల‌ని ఎంతో కోరిక ఉండేద‌ట‌. అదే విష‌యాన్ని జాన్వీతో కూడా చెప్పారంట‌. కానీ దీనికి స్పందించిన జాన్వీ క‌పూర్ వైద్య విద్య‌ను అభ్య‌సించే తెలివితేటలు తన వద్ద లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులు సినిమాల్లోకి వెళ్లడానికి ఒప్పుకున్నారట. చిన్న‌తన‌మంతా సినీ వాతావార‌ణంలో పెర‌గ‌డం వ‌ల్ల త‌న‌కు చిన్న‌నాటి నుంచి న‌ట‌న‌పై ఆస‌క్తి క‌లిగింద‌ని చెప్పిన జాన్వీ.. త‌న‌కున్న ప్ర‌తిభ వైద్య వృత్తికి స‌రిపోద‌ని తేల్చిచెప్ప‌డంతో సినిమాల్లోకి వెళ్ల‌డానికి శ్రీదేవీ ఓకే చెప్పిందంట‌. దీంతో తాను డాక్ట‌ర్ కావాల‌నుకున్న అమ్మ కోరిక‌ను తీర్చ‌లేక‌పోయాన‌ని వాపోయింది జాన్వీకపూర్. ఇక జాన్వీ సినిమాల విష‌యానికొస్తే.. ధ‌డ‌క్ వంటి న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది తొలి సినిమాతోనే న‌టిగా మంచి మార్కులు కొట్టేసింది. అనంత‌రం సినిమాల్లో త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నూ ఎంచుకుంటూ త‌ల్లికి త‌గ్గ కూతురుగా దూసుకెళుతోంది జాన్వీ.

Also Read: Anasuya Bharadwaj: పుష్ప తర్వాత.. రంగమ్మత్తను మరిచిపోతారా..? అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో

Dhethadi Harika: డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన దేత్తడి హారిక.. వైరల్ అవుతున్న వీడియో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!