Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో

Actor Bandla Ganesh: దేశమంతటా కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే

Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో
Bandla Ganesh

Actor Bandla Ganesh: దేశమంతటా కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగు వేల మంది మరణిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నటులు ఎవ్వరూ కూడా ఇత‌రుల‌పై ఆధార‌ప‌డేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కావున వారి ప‌నులు వారే చేసుకుంటూ కనిపిస్తున్నారు. తాజాగా బండ్ల గ‌ణేష్ త‌న తండ్రి కోసం కటింగ్ మాస్టర్‌గా మారారు.

త‌న తండ్రి జుట్టు బాగా పెర‌గ‌డంతో.. కరోనా నేపథ్యంలో బండ్ల గణేష్ ట్రిమ్మ‌ర్‌తో క్ష‌వ‌రం చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. కరోనా భయంతో మా నాన్నకి ఈ రోజు మా షాద్‌నగర్ ఇంట్లో తానే కటింగ్ చేశాను అంటూ కామెంట్ పెట్టారు. బండ్ల గ‌ణేష్‌. క‌మెడీయ‌న్ నుంచి నిర్మాత‌గా ఎదిగారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అందరూ బండ్ల గణేష్‌ను కొనియాడుతున్నారు. దీంతోపాటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బండ్ల గణేష్ ట్వీట్..

Also Read:

Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు

Telangana Corona Case: తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,186 కేసులు.. ఇవాళ 38 మంది మృతి