Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా కరోనా వికృతరూపం ప్రదర్శిస్తున్న వేళ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో నిందితుల‌ను అవ‌స‌ర‌మైతే తప్ప అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది.

Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు
Supreme Court
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2021 | 7:31 PM

Supreme Court on prisons: దేశవ్యాప్తంగా కరోనా వికృతరూపం ప్రదర్శిస్తున్న వేళ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో నిందితుల‌ను అవ‌స‌ర‌మైతే తప్ప అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. ఖైదీలంద‌రికీ స‌రైన వైద్య స‌దుపాయాలు అందేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న ఖైదీల‌ను గుర్తించి, వెంట‌నే రిలీజ్ చేసేలా చూడాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన అత్యున్నత క‌మిటీల‌కు సూచించింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా జైళ్లలో ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఇప్పటికే పెరోల్‌పై బయటకు వచ్చిన ఖైదీలకు మ‌రో 90 రోజులు పొడిగించాల‌నీ ఆదేశించింది. గతేడాది మార్చి 23న క‌రోనా నేప‌థ్యంలోనే తాత్కాలిక బెయిలు ఖైదీలు, పెరోల్‌పై ఉన్న వాళ్లను, ఏడేళ్ల కంటే త‌క్కువ శిక్ష ప‌డే నేరాల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని ప‌రిశీలించ‌డానికి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో క‌రోనా వ్యాప్తిని అదుపులో ఉంచ‌డానికి త‌ర‌చూ ఖైదీలు, జైలు అధికారుల‌కు టెస్టులు నిర్వహించాల‌ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖైదీల‌కు వైర‌స్ సోక‌కుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో 4 ల‌క్షల‌కుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్లలో సామ‌ర్థ్యానికి మించి ఉన్నట్లు కూడా కోర్టు గుర్తించింది. భౌతిక దూరం పాటించకుంటే వైరస్ ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also… Corona India: భారత్ లో 3-4 వారాలపాటు లాక్ డౌన్ విధించాలి అంటున్న డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ.. ( వీడియో )

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!