ఇక దేశవ్యాప్తంగా తీరనున్న ఆక్సిజన్ కొరత, ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసిన ‘సుప్రీం’, త్వరలో కేంద్రానికి నివేదిక

దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా, పంపిణీ, ఇతర అంశాలను పరిశీలించేందుకు, సమీక్షించేందుకు సుప్రీంకోర్టు 12 మంది సభ్యులగుతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.

ఇక దేశవ్యాప్తంగా తీరనున్న  ఆక్సిజన్ కొరత, ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసిన 'సుప్రీం', త్వరలో కేంద్రానికి నివేదిక
Supreme Court
Follow us

| Edited By: Phani CH

Updated on: May 08, 2021 | 7:54 PM

దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా, పంపిణీ, ఇతర అంశాలను పరిశీలించేందుకు, సమీక్షించేందుకు సుప్రీంకోర్టు 12 మంది సభ్యులగుతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. కోవిడ్ రోగులకు అవసరమైన మందులు లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకోవలసిన చర్యలను కూడా ఈ టాస్క్ ఫోర్స్ బృందం సూచిస్తుంది.వచ్చే వారం నుంచి ఈ బృందం తన పని ప్రారంభిస్తుందని, తన నివేదికను కేంద్రానికి, సుప్రీంకోర్టుకు కూడా అందజేస్తుందని తెలుస్తోంది. ఈ బృందంలోని ప్రతి సభ్యునితో జస్టిస్ వై.వీ.చంద్రచూడ్, జస్టిస్ షా మాట్లాడారు. ఈ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో శాస్త్రీయ, ప్రత్యేక చర్యలను సూచించడమే గాక, జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ని మెరుగుపరచడంలో ఈ బృందం కృషి చేస్తుందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ షా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ నిపుణులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ తో కాంటాక్ట్ లో ఉండాలని వారు సూచించారు. కనీవినీ ఎరుగని ఈ కోవిడ్ సంక్షోభ నివారణకు తీసుకోవలసిన చర్యలన్నింటినీ ఈ బృందం మదింపు చేస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డా.బబుతోష్ బిశ్వాస్, గుర్ గావ్ లోని మేదాంత హాస్పిటల్ ఎండీ, చైర్మన్ డా. నరేష్ ట్రెహాన్ ఆధ్వర్యంలో ఈ బృందం ఏర్పాటైంది. ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు. కన్వీనర్ గా కేబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు. వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపును ‘ప్రక్షాళన’ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలనీ సుప్రీంకోర్టు నిన్ననే నిర్ణయించింది. పాన్ ఇండియా కోసం ఆక్సిజన్ ఆడిట్ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. అత్యవసరమైన దీన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. మూడో కోవిడ్ తథ్యమని కేంద్రం భావిస్తున్న తరుణంలో ఇందుకు ముఖ్యంగా దీనినెదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బెంచ్ ప్రశ్నించింది. ఇందుకు సిద్ధంగా ఉన్నారా అని కూడా న్యాయమూర్తులు తెలుసుకోగోరారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37 లక్షలకు పెరగడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో

Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు