వైద్య సిబ్బందినీ వదలని మహమ్మారి, రిషికేష్ ఎయిమ్స్ లో 110 మంది డాక్టర్లు, నర్సులకు కోవిడ్ పాజిటివ్

నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని కూడా కరోనా వైరస్ వదలడంలేదు. ఉత్తరాఖండ్ రిషికేష్ లోని ఎయిమ్స్ లో పని చేస్తున్న 110 మంది డాక్టర్లు, నర్సులు కూడా కోవిడ్ పాజిటివ్ కి గురయ్యారు.

  • Publish Date - 7:58 pm, Sat, 8 May 21 Edited By: Phani CH
వైద్య సిబ్బందినీ వదలని మహమ్మారి, రిషికేష్ ఎయిమ్స్ లో 110 మంది డాక్టర్లు, నర్సులకు కోవిడ్ పాజిటివ్
Doctors

నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని కూడా కరోనా వైరస్ వదలడంలేదు. ఉత్తరాఖండ్ రిషికేష్ లోని ఎయిమ్స్ లో పని చేస్తున్న 110 మంది డాక్టర్లు, నర్సులు కూడా కోవిడ్ పాజిటివ్ కి గురయ్యారు. రోగులతో ప్రతి రోజూ కాంటాక్ట్ లో ఉన్న కారణంగానే ఒక్కసారిగా ఇంతమందికి పాజిటివ్ సోకినట్టు తెలుస్తోందని ఎయిమ్స్ పీఆర్ఓ హరీష్ తాపియాల్ అన్నారు. అయితే వీరందరికీ వ్యాక్సినేషన్ చేయించినట్టు ఆయన చెప్పారు.ఇంతమంది ఒకేసారి కోవిడ్ పాజిటివ్ బారిన పడడం ఇదే మొదటిసారి. ఇలాగే రిషికేష్ లోని కోవిద్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ విజయేశ్ భరద్వాజ్ కూడా పాజిటివ్ బారిన పడ్డారని ఆయన చెప్పారు. ఇలా ఉండగా కోవిద్ అదుపునకు ఈ నెల 10 లోగా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంటుందని ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. రాష్టంలోని గ్రామాలకు కూడా కోవిడ్ వ్యాప్తి చెందిందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు గ్రామాల్లో ఈ వైరస్ జాడ లేదన్నారు. కానీ ఇది ప్రస్తుతం పలు పల్లెల్లో వ్యాప్తి చెందిందని, గ్రామీణులను కోవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తామని అన్నారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఇది ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఇక తప్పనిసరిగా ప్రధాన నిర్ణయాలు తీసుకుంటామని సుబోధ్ వివరించారు.
ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,517 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఉత్తరాఖండ్ లో కేసుల సంఖ్య 67,691 కి పెరిగింది. డెహ్రాడున్, హరిద్వార్, నైనిటాల్, ఉద్ధం సింగ్ నగర్ లో ప్రభుత్వం కర్ఫ్యూను ఈ నెల 10 వరకు పొడిగించింది. కోవిడ్ ఉధృతి దృష్ట్యా దీన్ని మళ్ళీ పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అత్యధిక కేసులున్న యూపీ నుంచి వస్తున్న ప్రజలతో ఈ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్నారు. పొరుగు రాష్టాల సరిహద్దులను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఇక దేశవ్యాప్తంగా తీరనున్న ఆక్సిజన్ కొరత, ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసిన ‘సుప్రీం’, త్వరలో కేంద్రానికి నివేదిక

Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో