Telangana Corona Case: తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,186 కేసులు.. ఇవాళ 38 మంది మృతి
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రానికి 5,186 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ ఒక్క రోజే కొత్తగా మరో 38 మంది కోవిడ్ బారినపడి ప్రాణాలను కోల్పోయారు.
Telangana Corona Case: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రానికి 5,186 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ ఒక్క రోజే కొత్తగా మరో 38 మంది కోవిడ్ బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,704కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా శనివారం 7,994 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,21,219కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగా కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది. చాలా వరకూ జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య వందల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు, తెలంగాణలో నిన్న ఒక్కరోజే 69,148 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో నుంచే 5,186 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 2374 మంది ఫలితాలు తేలాల్సి ఉంది.
ఇక జిల్లాల వారీ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….