AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj: పుష్ప తర్వాత.. రంగమ్మత్తను మరిచిపోతారా..? అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

TV9 Exclusive interview: అటు టెలివిజన్.. ఇటు వెండితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది రంగమ్మత్త అనసూయ భరద్వాజ్. ఇటు పలు షోలల్లోనే

Anasuya Bharadwaj: పుష్ప తర్వాత.. రంగమ్మత్తను మరిచిపోతారా..? అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..
Anasuya Bharadwaj
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2021 | 7:10 PM

Share

TV9 Exclusive interview: అటు టెలివిజన్.. ఇటు వెండితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది రంగమ్మత్త అనసూయ భరద్వాజ్. ఇటు పలు షోలల్లోనే కాకుండా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ… ఫుల్ బిజీగా మారింది. యాంకర్‌గా కేరీర్‌ను ప్రారంభించి.. బుల్లితెరను షేక్ చేసి.. సినిమాలతో అలరిస్తోంది. తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినీ విషయాలను సోషల్ మీడియాలో పంచుకునే అనసూయ.. తనను ట్రోల్ చేసే నెటిజన్లకు కూడా సరైన సమాధానాలిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు టీవీ9తో సంభాషించింది. త తన సినిమా థ్యాంకూ బ్రదర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల నేపథ్యంలో టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తన కెరీర్ విషయాలను, పలు స్టార్ హీరోలతో నటించే సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంది.

రిచ్‌ మ్యాన్‌ అభిగా విరాజ్‌ అశ్విన్‌, ప్రెగ్నెంట్ విమెన్‌గా అనసూయ భరద్వాజ్‌ నటించిన ఈ సినిమాకు డిజిటల్‌ ఆడియన్స్‌ నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా విరాజ్‌, అనసూయ పెర్ఫామెన్స్‌ అద్భుతం అంటూ ఆడియెన్స్ కొనియాడుతున్నారు. అయితే అనసూయ థ్యాంకూ బ్రదర్ సినిమాతో పాటు.. పలు విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. పుష్ప తర్వాత రంగమ్మత్తను ఆడియన్స్ మరిచిపోతారా.. అని యాంకర్ అడగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతోపాటు పలు విషయాల గురించి కూడా మాట్లాడింది. దీనికి సంబంధించి ఈ కిందనున్న వీడియోను పూర్తిగా చూడవచ్చు.

Also Read:

Thank You Brother : ‘ఆహా’లో అలరిస్తున్న అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’.. గర్భవతి పాత్రలో ఆకట్టుకున్న జబర్ధస్ భామ..

Jathi Ratnalu Sequel: ‘జాతిరత్నాలు’ సీక్వెల్‌కు రంగం సిద్దం.. స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ అనుదీప్‌..