Mahesh Tweet: త‌ప్ప‌నిస‌రైతేనే బ‌య‌ట‌కు రావాలంటోన్న‌ ప్రిన్స్‌.. క‌రోనా వేళ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోన్న మ‌హేశ్‌..

Mahesh Tweet: క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా వైర‌స్ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తోంది. ఇక క్ష‌ణాల్లో శ్వాస అంద‌క ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వ్యాధి సోక‌క ముందే..

Mahesh Tweet: త‌ప్ప‌నిస‌రైతేనే బ‌య‌ట‌కు రావాలంటోన్న‌ ప్రిన్స్‌.. క‌రోనా వేళ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోన్న మ‌హేశ్‌..
Mahesh Babu

Mahesh Tweet: క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా వైర‌స్ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తోంది. ఇక క్ష‌ణాల్లో శ్వాస అంద‌క ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వ్యాధి సోక‌క ముందే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది సెల‌బ్రిటీలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.
తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా త‌న అభ‌మానులకు విజ్ఞప్తి చేశారు. కరోనా క‌రాళ నృత్యం చేస్తోన్న వేళ‌.. ‘తప్పనిసరైతేనే బయటకు రండి. అనవసరంగా బయటకు రావొద్దు. జాగ్రత్తలు తప్పక పాటించండి’ అంటూ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు మ‌హేశ్‌. ఈ సందర్భంగా కొన్ని ముఖ్య‌మైన విష‌యాలను పంచుకున్నారు. మ‌హేష్ ట్వీట్ చేస్తూ.. ‘రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్‌ ధరించండి. అత్య‌వ‌స‌ర‌మైదే త‌ప్ప బ‌య‌ట‌కు రాకండి. ఒకవేళ కరోనా వైరస్‌ వస్తే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీనిద్వారా అవసరమైన వారికి బెడ్లు అందుతాయి. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని ట్వీట్‌ చేశారు.

మ‌హేశ్ చేసిన ట్వీట్‌..

 

Also Read: Prabhas: 2025 వరకు ప్రభాస్‌ ఫుల్ బిజీ.. డేట్స్ అసలు ఖాళీ లేవట..?

Dhethadi Harika: డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన దేత్తడి హారిక.. వైరల్ అవుతున్న వీడియో..

Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో