Gram Pradhan: గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు.. నయా పాకిప్తాన్ తెస్తానన్నాడు.. అడ్డంగా బుక్కై జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు..

Gram Pradhan: విజయోత్సాహంలో నయా పాకిస్తాన్‌ను తీసుకువస్తానంటూ హామీ ఇచ్చిన గ్రామ ప్రధాన్‌ను అమెథి పోలీసులు అరెస్ట్ చేశారు.

Gram Pradhan: గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు.. నయా పాకిప్తాన్ తెస్తానన్నాడు.. అడ్డంగా బుక్కై జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2021 | 12:56 PM

Gram Pradhan: విజయోత్సాహంలో నయా పాకిస్తాన్‌ను తీసుకువస్తానంటూ హామీ ఇచ్చిన గ్రామ ప్రధాన్‌ను అమెథి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. అమేథీలోని రామ్‌గంజ్ ప్రాంతంలోని మంగ్రా గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఖాన్.. తన మద్దతుదారులతో కలిసి మే 4వ తేదీన గ్రామంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా అతని మద్ధతుదారులు ‘ఇమ్రాన్ ఖాన్ ఆయా.. నయా పాకిస్తాన్ లాయా’(ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు.. కొత్త పాకిస్తాన్ తెస్తాడు) అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. చివరికి జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ కంట పడటంతో.. దీనిపై విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ చేపట్టిన అధికార బృందం.. గ్రామ ప్రధాన్ ఇమ్రాన్ ఖాన్, అతని అనుచరులైన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిసేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా.. ర్యాలీ నిర్వహించాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఇమ్రాన్ ఖాన్, అతని అనుచరులు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అలాగే జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ వారిపై సెక్షన్ 153-బి, ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వారికి చెందిన మూడు స్పోర్ట్స్ బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Viral Video:

Also read:

ఒంటెల్లో యాంటీ బాడీలు, కోవిడ్ అదుపునకు మానవాళికి సహకరిస్తాయా ? యూఏఈ లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిశోధనలు

Beauty Tips: వేసవిలో ఇంట్లో ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి, చర్మం ప్రకాశవంతంగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది.

తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ తెలుగువారే..! ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. తెలుసుకోండి..