5

తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ తెలుగువారే..! ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. తెలుసుకోండి..

Tamil Nadu CM Stalin : తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ పూర్వీకులు తెలుగువారే అని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని

తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ తెలుగువారే..! ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. తెలుసుకోండి..
Tamil Nadu Cm Stalin
Follow us

|

Updated on: May 09, 2021 | 12:09 PM

Tamil Nadu CM Stalin : తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ పూర్వీకులు తెలుగువారే అని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందినవారే. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం. కరుణానిధి మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారు. ఆయన మాతృభాష తెలుగు.

ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన అసలు పేరు దక్షిణా మూర్తి. కరుణానిధి పూర్వీకులది నిజానికి విజయనగరం జిల్లా. జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చిన కరుణ పూర్వీకులు ఇక్కడ పెళ్లూరు సంస్థానాన్ని పరిపాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో చేరారు వాయిద్య కళాకారులుగా ప్రతిభ చూపిస్తూ వెంకటగిరి మహారాజు వద్ద పేరు తెచ్చుకున్నారు

అంతేకాదు ఒంగోలు శివారు లోని పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు మంగళవాయిద్యాలు వాయించేవారు. ఈ విధంగా నాయిబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు ఐదు కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డారు. వీరి కుటుంబం నివసించడానికి చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించారు మహరాజావారు అంతేగాక వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు వెంకటగిరి మాహరాజా వారు. ఆభూములను సాగుచేసుకుంటూ, దేవాస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా చాలాకాలం పనిచేశారు

అనంతరం కరువు కాటకాలు రావడం, పంటలు పండకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లారు ఈ విషయాలను కరుణానిధే స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. కరుణానిధి కూడా చిన్నతనంలోనే నాదస్వరం ఎంతో గొప్పగా వాయించేవారని చెబుతారు ఆ గ్రామాలలోని పాత తరం వృద్దులు.

కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం

కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ