బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆందోళన, డీజీపీ సహా ఉన్నతాధికారులకు పిలుపు

బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులతో బాటు ఎన్నికల ఫలితాల రోజున రాష్ట్రంలో జరిగిన హింసపై తనకు అధికారులు సమాచారమేదీ ఇవ్వలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  • Publish Date - 11:04 am, Sun, 9 May 21 Edited By: Phani CH
బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆందోళన, డీజీపీ సహా ఉన్నతాధికారులకు పిలుపు
Bengal Governor

బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులతో బాటు ఎన్నికల ఫలితాల రోజున రాష్ట్రంలో జరిగిన హింసపై తనకు అధికారులు సమాచారమేదీ ఇవ్వలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం డీజీపీ వీరేంద్రను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను పిలిపించి ఆయన వివరాలు కోరారు. అయితే దురదృష్టవశాత్తూ వారు ఎలాంటి పేపర్ వర్క్ తో రాలేదని, ఇందుకు చాలా కలత చెందుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. డీజీపీ రిపోర్టులు గానీ కోల్ కతా పోలీస్ కమిషనర్ నివేదికను గానీ హోమ్ కార్యదర్శి పంపలేదని జగ దీప్ ధన్ కర్ వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల ఈ ఉదాసీన వైఖరి సముచితం కాదని ఆయన తన ట్వీట్స్లో పేర్కొన్నారు. బెంగాల్ హింసలో సుమారు 16 మంది మృతి చెందారు. కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై కూడా ఈ మధ్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా గవర్నర్, సీఎం మమతా బెనర్జీ మధ్య సఖ్యత లేని విషయం గమనార్హం. ముఖ్యమంత్రిగా మమత ప్రమాణ స్వీకారం చేసిన రోజున..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితికి ప్రయారిటీ ఇవ్వాలని గవర్నర్ కోరగా,, మమత దీన్ని కాదని కోవిడ్ అదుపునకు తీసుకోవలసిన చర్యలకు ప్రాధాన్యమిస్తానని అన్నారు. అన్నట్టే ఆ రోజున ఆమె మొదట బెంగాల్ లో కోవిడ్ కంట్రోల్ పై దృష్టి పెట్టారు. తమ రాష్ట్రానికి ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు సమర్పించాలని, ..ఇలాగే పలు నిబంధనలను నిర్దేశించారు. మెట్రో సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.
అటు-ఎన్నికల అనంతరం జరిగి న హింసలో వివిధ పార్టీలకు చెందిన 16 మంది కార్యకర్తలు మృతి చెందారని మమత ఇటీవల పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: CORONA SECOND WAVE: ఆ పన్నెండు రాష్ట్రాల్లోనే అదుపుతప్పుతున్న కరోనా.. 80శాతం కేసులు అక్కడే!

బరువు తగ్గడానికి జీలకర్ర టీని తాగండి..! చాలా తొందరగా ప్రభావం చూపుతుంది.. ట్రై చేసి చూడండి..