AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటెల్లో యాంటీ బాడీలు, కోవిడ్ అదుపునకు మానవాళికి సహకరిస్తాయా ? యూఏఈ లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిశోధనలు

కోవిడ్ 19 వైరస్ ని ఎడారుల్లో ప్రయాణించే ఒంటెలు ఎలా నిరోధించగలుగుతాయో చూసేందుకు గల్ఫ్ దేశాల్లో ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి.

ఒంటెల్లో యాంటీ బాడీలు, కోవిడ్ అదుపునకు మానవాళికి సహకరిస్తాయా ? యూఏఈ లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిశోధనలు
Anti Bodies In Camels
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 09, 2021 | 12:49 PM

Share

కోవిడ్ 19 వైరస్ ని ఎడారుల్లో ప్రయాణించే ఒంటెలు ఎలా నిరోధించగలుగుతాయో చూసేందుకు గల్ఫ్ దేశాల్లో ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ని నిరోదించగల యాంటీబాడీలు ఒంటెల్లో ఉంటాయని దుబాయ్ లోని వెటర్నరీ మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ ఉల్ రిచ్ వెర్నెరీ ఓ కొత్త విషయాన్ని ప్రకటించారు. కోవిడ్ 19 డెడ్ వైరస్ శాంపిల్స్ ని ఈయన ఆధ్వర్యంలోని బృందం ఈ జంతువుల్లో జొప్పించినప్పుడు వీటిలోని యాంటీ బాడీలు వైరస్ ని ఎలా నిరోధించాయన్న అంశం బయటపడింది. దీనిపై ఈ బృందం కూలంకషంగా రీసెర్చ్ చేస్తోంది. ఒంటెల్లోని మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే వ్యవస్థ కారణంగా వీటిలోని ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు. శ్వాస సరిగా ఆడకపోవడం, గాస్ట్రో ఇంటస్టైనల్ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, చివరకు డెత్..ఇవి కోవిడ్ లక్షణాలు.. కానీ ఈ కొత్త కోవిడ్ వైరస్ ని ఒంటెలకు ఇచ్చినా అవి రుగ్మతకు గురి కాలేదని , భేషుగ్గా ఉన్నాయని ఈ బృందం పేర్కొంది. వీటిలో వైరస్ రిసెప్టర్ ఉండదు.. కణజాలంలోకి ప్రవేశించే హోస్ట్ సెల్ నే రిసెప్టర్ అంటారు..కానీ మనుషులు, ఇతర జంతువుల్లో ఈ వ్యవస్థ ఉంటుంది అని ఉల్ వెర్నెరీ వివరించారు.ఒంటెల్లో ఇది ఉండదు గనుక కోవిడ్ వైరస్ వీటిలోని మ్యూకోసా కణజాలంలోకి ప్రవేశించజాలదు అని ఆయన చెప్పారు.ఇది చాలా ఆశ్చర్యకరమని, మనుషులతో బాటు పిల్లులు, పులులు, సింహాలు కూడా కోవిద్ బారిన పడుతున్నాయని ఆయన అన్నారు. వీటి ద్వారా మనుషులకు, మళ్ళీ మనుషుల నుంచి ఈ జంతువులకు వైరస్ సోకుతోందన్నారు. అయితే ఒంటెలు మాత్రం సేఫ్ అని వ్యాఖ్యానించారు. డెడ్ కోవిడ్ వైరస్ ని ఈ జంతువులకు ఇఛ్చాము.. ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి.. ఇక ఒంటెల రక్తాన్ని కోవిడ్ డయాగ్నసిస్ టెస్టులకు ఉపయోగించే రోజు త్వరలో వస్తుందని భావిస్తున్నాం అని అయి రీసెర్చర్ చెప్పారు. కోవిద్ రోగుల చికిత్సలో వీటి బ్లడ్ ను వినియోగించే రోజు ఎప్పుడో వస్తుందని కూడా భావిస్తున్నామన్నారు. కాగా అమెరికాలోని శాన్ డీగో జూలో మొదటిసారిగా గొరిల్లాలు కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యాయి. ఆ తరువాత కొన్ని చోట్ల పులులు , సింహాలు, పిల్లులు కూడా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి: Beauty Tips: వేసవిలో ఇంట్లో ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి, చర్మం ప్రకాశవంతంగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది.

Viral video: లాక్‌డౌన్ ఎఫెక్ట్… చెట్లపొదల్లో ఫన్నీ పెళ్లి…. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు… ( వీడియో )