Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CHINESE BIO-WEAPON: కరోనా చైనీస్ బయో వెపనే.. డ్రాగన్ సైంటిస్టులు, మిలిటరీ అధికారుల మధ్య ఐదేళ్ళ క్రితమే చర్చ?

ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ యాదృచ్ఛికంగా జీవుల నుంచి పుట్టిందా? లేక చైనా జీవాయుధంగా తయారు చేసి ప్రపంచం మీదికి వదిలిందా? ఈ చర్చ మళ్ళీ మొదలైంది.

CHINESE BIO-WEAPON: కరోనా చైనీస్ బయో వెపనే.. డ్రాగన్ సైంటిస్టులు, మిలిటరీ అధికారుల మధ్య ఐదేళ్ళ క్రితమే చర్చ?
China Biowar
Follow us
Rajesh Sharma

|

Updated on: May 09, 2021 | 1:15 PM

CHINESE BIO-WEAPON CORONA VIRUS DRAGAN CONSPIRACY: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (CORONA VIRUS) యాదృచ్ఛికంగా జీవుల నుంచి పుట్టిందా? లేక చైనా (CHINA) జీవాయుధంగా (BIO-WEAPON) తయారు చేసి ప్రపంచం (WORLD) మీదికి వదిలిందా? ఈ చర్చ మళ్ళీ మొదలైంది. కాకపోతే ఈసారి కొన్ని సాక్ష్యాల సహితంగా చర్చ మొదలైంది. నిజానికి ఈ రకమైన వాదనను చైనా పలు మార్లు ఖండించింది. కానీ.. చైనా మూడో ప్రపంచ యుద్ధాన్ని (THIRD WORLD WAR) జీవాయుధాలతో ప్రారంభించాలన్న కుతంత్రంతోనే కరోనా వైరస్‌ను తయారు చేసి ప్రపంచం మీదికి వదిలిందన్నట్లు తాజాగా కథనాలు మొదలయ్యాయి.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను చైనా తమ జీవాయుధాల లాబ‌రేట‌రీ (BIO-WEAPON LABORATORY)ల్లో త‌యారు చేసింద‌ని తాజాగా సాక్ష్యాలు వెల్లడవుతున్నాయి. జీవాయుధంగా కరోనా (CORONA)ను తయారు చేసిన చైనా.. కావాల‌నే భూమ్మీద‌కు వ‌దిలింద‌ని అమెరికా (AMERICA) స‌హా ప‌లు దేశాలు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బ‌హిర్గ‌త‌మైన ఓ డాక్యుమెంట్ డ్రాగ‌న్ (DRAGON) కుతంత్రాల‌ను మ‌రోసారి వెల్ల‌డించింది. ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్‌లో చైనా మిలిట‌రీ శాస్త్ర‌వేత్త (CHINESE MILITARY SCIENTIST) ఒక‌రు మూడో ప్ర‌పంచం యుద్ధం గురించి ప్రస్తావించారు. సార్స్ వైర‌స్ (SARS VIRUS) జాతి నుంచి త‌యారు చేసిన జీవాయుధంతో యుద్ధం జ‌రుగుతుందని చైనా ప్ర‌భుత్వ ఆరోగ్య అధికారి (CHINESE GOVERNMENT HEALTH OFFICER)తో చ‌ర్చించిన‌ట్లు ఈ డాక్యుమెంట్ వెల్ల‌డించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్ (AMERICA STATE DEPARTMENT) దీనిని స్వాధీనం చేసుకుంది.

చైనా సైంటిస్టులు (CHINESE SCIENTISTS), పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ సార్స్‌ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ న్యూస్.కామ్ ప్రకారం.. “ది అన్‌నాచుర్‌ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్‌ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్‌ బయోవెప‌న్స్‌” డాక్యుమెంట్‌లో చైనా మిల‌ట‌రీ సైంటిస్టు మూడో ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేశారు. కరోనావైరస్‌ల‌ను “జన్యు ఆయుధాల కొత్త శకం”గా.. “కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత త‌రంలో వాడే ఆయుధాలు మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా ఉంటాయ‌ని” ఈ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు.

చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్‌-2 వైర‌స్ త‌యారైన‌ట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డ్రాగన్ మిలిటరీ అధికారులు, సైంటిస్టుల మధ్య అయిదేళ్ళ క్రితమే జరిగిన జీవాయుధాల ప్రస్తావన చర్చలు చైనా కుతంత్రాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. చైనా నిజంగానే ఇలాంటి జీవాయుధంగా కరోనాను సృష్టించి వుంటే.. ఆ దేశాన్ని యావత్ ప్రపంచ దేశాలు వెలి వేయాలని అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..