కృష్ణాజిల్లాలో అమానుషం.. కరోనా నెగిటివ్ వచ్చినా తండ్రికి అంత్యక్రియలు చేయని వైనం
కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా వచ్చిన వాళ్లను దూరంగా ఉంచిన ఘటనలు…. కరోనా వచ్చిన వారిపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతవరకు చూసాం…
కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా వచ్చిన వాళ్లను దూరంగా ఉంచిన ఘటనలు…. కరోనా వచ్చిన వారిపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతవరకు చూసాం… కానీ ఇక్కడ మాత్రం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ మహమ్మారి భయంతో మరణించిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది. కృష్ణాజిల్లా చినతాడినాడకు చెందిన రాంబాబు అనే ఇతను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో రాంబాబు అల్లుడు నరసింహారావు..అతన్ని బైక్‌పై కూర్చుబెట్టుకుని ఆస్పత్రికి బయల్దేరారు. నరసింహారావు దివ్యాంగుడు..అతడు మాట్లాడలేడు, చెవులు కూడా వినిపించవు..ఆస్పత్రి అడ్రస్ దొరక్క స్థానికులను ఆరా తీస్తూ బయల్దేరారు..అతడు ఆస్పత్రికి వెళ్లేలోపు బైకు వెనకాల కూర్చున్న రాంబాబు ప్రాణం మార్గమధ్యలోనే పోయింది. చివరకు ఆస్పత్రికి చేరుకున్న రాంబాబును ఆకివీడు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. వెంటనే కరోనా టెస్ట్ చేయగా, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మృతుడి కుమారుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు వైద్య సిబ్బంది.
అయితే, ప్రస్తుతం తాను ఊర్లో లేనని, మీరే కార్యం కానిచ్చేయండి అంటూ ఆ కొడుకు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే చిన్నతాడినాడ సర్పంచ్‌కు సమాచారం అందించగా, కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులను పంపి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచి వేసింది.
Also Read: కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ