Bird Killer Tree: ఆ చెట్టుపైన కూర్చున్న ప్ర‌తి ప‌క్షి చ‌నిపోయిన‌ట్లే.. ప్ర‌మాద‌క‌ర‌మైన ‘బర్డ్ కిల్లర్’

ప్రపంచంలో కనిపించే చాలా మొక్కలు వాటి మనుగడ కోసం పక్షులు, కీటకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ మొక్కల విత్తనాలను ఒక ప్రదేశం నుండి...

Bird Killer Tree: ఆ చెట్టుపైన కూర్చున్న ప్ర‌తి ప‌క్షి చ‌నిపోయిన‌ట్లే.. ప్ర‌మాద‌క‌ర‌మైన  'బర్డ్ కిల్లర్'
Pisonia Tree
Follow us

|

Updated on: May 09, 2021 | 12:22 PM

ప్రపంచంలో కనిపించే చాలా మొక్కలు వాటి మనుగడ కోసం పక్షులు, కీటకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ మొక్కల విత్తనాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాప్తి చేయడం ద్వారా ఈ జీవులు వాటి సంఖ్యను పెంచుతాయి. కానీ ప్రపంచంలో త‌నపై కూర్చున్న పక్షులను మాత్రమే చంపే చెట్టు జాతి కూడా ఉంది. మేము పిసోనియా అనే చెట్టు జాతి గురించి మాట్లాడుతున్నాము. ఈ జాతి జ‌ట్లు పక్షులను చంపుతున్నందుకు ప్రపంచం మొత్తంలో అపఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నాయి. వాస్త‌వంగా చెప్పాలంటే ఈ చెట్లు కూడా పక్షుల సహాయంతో విత్తనాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అవి ప‌క్షులు ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయి.

విత్తనాలు ఈకలలో అంటుకుంటాయి

పిసోనియా చెట్టు విత్తనాలు చాలా జిగటగా, బంక మాదిరిగా, పెద్దవిగా ఉంటాయి. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చున్నప్పుడల్లా దాని విత్త‌నాలు పక్షి రెక్కల మ‌ధ్య‌లో అంటుకుంటాయి. దీనివల్ల పక్షులు మళ్లీ ఎగిరేందుకు ఆస్కారం ఉండ‌దు. చివరికి నేలమీద పడిపోయి.. ఎగిరేందుకు వీలులేక.. ఆక‌లి, దప్పిక‌తో మ‌ర‌ణిస్తాయి.

Also Read: కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ

‘అమ్మ’ సృష్టికే మూలం.. అమ్మ ముద్దుల వెనుకే కాదు.. దెబ్బల వెనుక కూడా అపారమైన ప్రేమ ఉంటుంది