AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: వేసవిలో ఇంట్లో ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి, చర్మం ప్రకాశవంతంగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది.

Beauty Tips: వేసవి కాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో చర్మం పొడిబారడం, వాడిపోయినట్లుగా కనిపిస్తుంటుంది.

Beauty Tips: వేసవిలో ఇంట్లో ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి, చర్మం ప్రకాశవంతంగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది.
Shiva Prajapati
|

Updated on: May 09, 2021 | 12:31 PM

Share

Beauty Tips: వేసవి కాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో చర్మం పొడిబారడం, వాడిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. దీనివల్ల మీ ముఖం నీరసంగా కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో జనాలు పార్లర్లకు వెళ్లి ఫేస్‌ ప్యాక్‌లు చేయించుకునే పరిస్థితి లేదు. అయితే, ఇక్కడ ఒక చక్కటి అవకాశం మీకుందనే చెప్పాలి. ఇంట్లో ఉండే.. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇంట్లో ఉపయోగించే చిన్న చిన్న ఆహార పదార్థలతో ముఖారవిందాన్ని వేసవిలోనూ మరింత పెంచుకోవచ్చు. వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలతో ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ ప్యాక్‌.. మీ ముఖ చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు.. అందంగా మెరిసేలా చేయడానికి తోడ్పడుతుంది. ఇంట్లో ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా ఫేస్ ప్యాక్.. పుదీనా ఫేస్ మాస్క్ చేయడానికి.. పుదీనా ఆకులను బాగా రుబ్బాలి. అందులో పసుపు, కొన్ని నీళ్లతో మిక్స్ చేయాలి. ఆ తరువాత పూదీనా మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసుకోవాలి. కొంత సమయం అలాగే ఉంచి.. మంచినీటితో కడుక్కోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల ముఖ చర్మం ప్రకాశవంతంగా మారడంతో పాటు.. ఆరోగ్యంగా ఉంటుంది.

దోసకాయ ఫేస్ ప్యాక్.. సగం దోసకాయను తురమాలి. దానికి కలబంద జెల్‌ను కలపాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దోసకాయ చర్మానికి ఉత్తేజాన్నిస్తుంది. దీనిలో కలిపిన కలబంద చర్మ సమస్యలను తొలగిస్తుంది.

తేనె మరియు నిమ్మకాయ ప్యాక్.. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి నిమ్మరసం మరియు తేనె అవసరం. తేనె, నిమ్మరం మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. పేస్ట్ బాగా ఆరిపోయిన తరువాత మంచి నీటితో కడగాలి. నిమ్మకాయ చర్మంలో మలినాలతో పాటు.. జిడ్డును తొలగిస్తుంది. తేనె మీ చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

గుడ్డు, తేనె ప్యాక్.. గుడ్డు సొనలో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ ప్యాక్ ఆరిన తరువాత.. నీటితో కడగాలి. అందులో ఉన్న తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇలా ఈ ప్యాక్‌ను కొన్ని రోజులు అప్లై చేసినట్లయితే మీ చర్మం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.

టమోటా ప్యాక్.. టమోటా ఫేస్ ప్యాక్ చేయడానికి టమోటా అవసరం. ఒకటి లేదా రెండు టామోటాలను పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌లో ఒక చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత ముఖాన్ని నీటితో కడుక్కోవాలి.

Also read:

తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ తెలుగువారే..! ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. తెలుసుకోండి..

Actress Sai Pallavi : అందాల సాయి పల్లవి అదిరిపోయే లుక్ రిలీజ్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్..