Actress Sai Pallavi : అందాల సాయి పల్లవి అదిరిపోయే లుక్ రిలీజ్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్..

చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం.. ఆ ముద్దుగుమ్మే సాయిపల్లవి. ఎంతో సింపుల్ గా...స్కిన్ షో  దూరంగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి.

Actress Sai Pallavi : అందాల సాయి పల్లవి అదిరిపోయే లుక్ రిలీజ్ చేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2021 | 11:51 AM

 Actress Sai Pallavi : చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం.. ఆ ముద్దుగుమ్మే సాయిపల్లవి. ఎంతో సింపుల్ గా…స్కిన్ షో  దూరంగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదాసినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ కుర్రది నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య ఈ సినిమా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. అలాగే ఈ సినిమాతోపాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తుంది సాయిపల్లవి. ఈ సినిమాలో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. అలాగే నాని సినిమాలో కూడా నటిస్తుంది పల్లవి.

నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్  సినిమా హీరోయిన్ గా నటిస్తుంది సాయిపల్లవి. పిరియాడికల్ లవ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి తోపాటు, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అదితిరావు హైదరి నటిస్తున్నారు. తాజాగా నేడు సాయి పల్లవి పుట్టిన రోజు కానుకగా శ్యామ్ సింగరాయ్ నుంచి ఈ ముద్దుగుమ్మ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ramyug web series : ట్రెండీ లుక్‌ లో రాముడు మరియు డిఫరెంట్ మేకోవర్ లో రావణుడు… నెటిజన్లు ఫైర్‌.. ( వీడియో )

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.

Dimple Hayati : తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న డింపుల్ హయతి